అభిమానుల అత్యుత్సాహం... మహారాష్ట్ర మాలేగావ్‌లోని ఓ థియేటర్లో అగ్ని ప్రమాదానికి దారితీసింది.
లాక్‌డౌన్‌తో మూతపడి, ఇటీవల తిరిగి తెరుచుకున్న థియేటర్లో కరణ్ అర్జున్ సినిమా ప్రదర్శిస్తుండగా ఈ ఘటన జరిగింది. తెరపై షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కనిపించగానే కొందరు అభిమానులు హాల్లోనే టపాసులు పేల్చారు. ఫలితంగా మంటలు చెలరేగాయి. కొన్ని కుర్చీల దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: మొతేరాకు 'నరేంద్ర మోదీ' స్టేడియంగా పేరు మార్పు