మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల టేకాఫైన ప్రదేశానికే తిరిగి వచ్చింది. ధార్ వెళ్లేందుకు హెలికాప్టర్ మనావర్ నుంచి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించగానే సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల వెంటనే తిరిగి వెనక్కి వచ్చినట్లు ఎస్డీఓపీ ధీరజ్ తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రోడ్డు మార్గంలో ధార్‌కు వెళ్లినట్లు చెప్పారు.
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే త్రుటిలో అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మహారాష్ట్ర పుణెలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె చీరకు నిప్పంటుకుంది. వేదికపై శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న సమయంలో ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్న కొందరు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేశారు. అనంతరం మాట్లాడిన ఆమె.. ఎవరూ ఆందోళన చెందొద్దని.. తనకు ఏమీ కాలేదని చెప్పారు.
ఇవీ చదవండి: జల్లికట్టు అదిరిపోయేట్టు.. దేశవ్యాప్తంగా సంబరంగా సంక్రాంతి