Metaverse Marriage In Tamilnadu: దేశంలోనే తొలిసారిగా మెటావర్స్ పద్ధతిలో వివాహ రిసెప్షన్ నిర్వహించారు తమిళనాడుకు చెందిన దంపతులు. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంధువులు, మిత్రులు వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు.
తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌గా పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు దినేష్ క్షత్రియన్‌కు జనగ నందినితో వివాహం జరిగింది. వీరి వివాహం రిసెప్షన్ కృష్ణగిరి జిల్లా అనచెత్తి మండలం శివలింగాపురంలో ఫిబ్రవరి 6న నిర్వహించారు. ఇది ఆసియాలోనే మొదటి మెటావర్స్ వివాహ రిసెప్షన్ అని దినేష్ క్షత్రియన్ తెలిపారు.
'నాకు 2022, ఫిబ్రవరిలో వివాహం జరిగింది. కరోనా కారణంగా రిసెప్షన్‌ను మెటావర్స్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.' అని దినేష్ పేర్కొన్నాడు.
మెటావర్స్ పద్ధతిలో ఎలా..
మెటావర్స్ పద్ధతిలో యూజర్లంతా వర్చువల్‌గా కలుసుకుని, డిజిటల్ అవతార్‌లతో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు. మెటావర్స్‌లో ఆగ్మెంటెడ్ రియాల్టీ, బ్లాక్‌చైన్, వర్చువల్ రియాల్టీ కలగలిసి ఉంటాయి.
హారీ పాటర్ సిరీస్‌లోని హాగ్వార్ట్స్ థీమ్‌తో దంపతులు ఈ వర్చువల్ రిసెప్షన్లో కనిపించారు. మెటావర్స్ పద్ధతిలోనే చెన్నైలో మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను 200 మంది అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన వారికి ఇంటికే భోజనాలు అందించారు.
12మంది బృంద సభ్యులతో దాదాపు నెలరోజులు పనిచేసి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేశామని మెటావర్స్ వర్చువల్ పద్ధతిని డిజైన్ చేసిన ఐటీ నిపుణుడు వినేష్ సెల్వరాజ్ తెలిపారు.
ఈ రిసెప్షన్ తర్వాత దేశవ్యాప్తంగా 60 ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇప్పుడు వాటిపై పనిచేస్తున్నామని తెలిపారు.
-
At @kshatriyan2811 's meta wedding 👰💍🤵💒 @TardiVerse #asiasfirst #Metaverse #metawedding pic.twitter.com/RRGyEzUz4Y
— cryptopangu.nft (@CryptoPangu) February 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">At @kshatriyan2811 's meta wedding 👰💍🤵💒 @TardiVerse #asiasfirst #Metaverse #metawedding pic.twitter.com/RRGyEzUz4Y
— cryptopangu.nft (@CryptoPangu) February 6, 2022At @kshatriyan2811 's meta wedding 👰💍🤵💒 @TardiVerse #asiasfirst #Metaverse #metawedding pic.twitter.com/RRGyEzUz4Y
— cryptopangu.nft (@CryptoPangu) February 6, 2022
-
Finally into Asia's 1st Metaverse Wedding. Interesting experience. @beyondlifeclub @TardiVerse @kshatriyan2811 pic.twitter.com/zhGPTuedOf
— Divit (@divitonchain) February 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Finally into Asia's 1st Metaverse Wedding. Interesting experience. @beyondlifeclub @TardiVerse @kshatriyan2811 pic.twitter.com/zhGPTuedOf
— Divit (@divitonchain) February 6, 2022Finally into Asia's 1st Metaverse Wedding. Interesting experience. @beyondlifeclub @TardiVerse @kshatriyan2811 pic.twitter.com/zhGPTuedOf
— Divit (@divitonchain) February 6, 2022
ఇదీ చూడండి: 'జేఎన్‌యూ'కు తొలి మహిళా వీసీ.. తెలుగు వారే!