ETV Bharat / bharat

ఛోక్సీపై ఇంటర్​పోల్ రెడ్​కార్నర్ నోటీసు తొలగింపు!.. కాంగ్రెస్ ఫైర్

పీఎన్​బీ స్కామ్​లో నిందితుడు మెహుల్ ఛోక్సీపై ఇంటర్​పోల్ రెడ్​కార్నర్ నోటీసును ఉపసంహరించుకుంది. ఛోక్సీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలకు దిగారు. పాత స్నేహితుడి కోసం కేంద్రమే ఈ సాయం చేసిందని మండిపడ్డారు.

mehul choksi news
mehul choksi news
author img

By

Published : Mar 21, 2023, 1:19 PM IST

Updated : Mar 21, 2023, 4:16 PM IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీపై రెడ్‌కార్నర్‌ నోటీసులను ఇంటర్‌పోల్‌ ఉపసంహరించుకుంది. ఛోక్సీ విజ్ఞప్తి మేరకు లియోన్‌లోని ఇంటర్‌పోల్‌ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్​పోల్​కు చెందిన సీసీఎఫ్ (కంట్రోల్ ఆఫ్ ఇంటర్​పోల్స్ ఫైల్స్) విభాగం 2022 నవంబర్​లోనే ఆయన పేరును రెడ్ నోటీస్ జాబితా నుంచి తొలగించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీబీఐ స్పష్టం చేసింది.

"2022లో ఛోక్సీ ఇంటర్​పోల్​లోని సీసీఎఫ్​ను ఆశ్రయించారు. ఐదుగురు సభ్యులు ఉన్న సీసీఎఫ్ ఛాంబర్.. వాస్తవాలను విస్మరించి ఆయన పేరును రెడ్ నోటీస్ నుంచి తొలగించాలని 2022 నవంబర్​లో నిర్ణయం తీసుకుంది. వారి నిర్ణయంలో లోపాలను గుర్తు చేసి, అదనపు సమాచారం అందించి.. రెడ్ కార్నర్ నోటీసులు పునరుద్ధరించేలా సీబీఐ చర్యలు తీసుకుంటోంది."
-సీబీఐ

ఇంటర్​పోల్ సీసీఎఫ్​లో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇంటర్​పోల్ సెక్రెటేరియట్​కు.. సీసీఎఫ్​తో సంబంధం ఉండదు. అందులోని సభ్యులంతా వివిధ దేశాల నుంచి ఎంపికైన న్యాయవాదులే. రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేస్తే ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లో ఎక్కడున్నా నిందితులను పట్టుకుని, అరెస్టు చేసే అధికారం ఇంటర్‌పోల్‌ అధికారులకు ఉంటుంది. ఈ నిర్ణయంతో ఛోక్సీ ఇప్పుడు ప్రపంచంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది.

అంటిగ్వా పౌరసత్వం ఉన్న ఛోక్సీ.. 2021 మేలో ఆ దేశం నుంచి కనిపించకుండా పోయారు. ఒక్కసారిగా పొరుగు దేశమైన డొమినికాలో ప్రత్యక్షమయ్యారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించారన్న కారణంతో ఆయన్ను స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనను భారత అధికారులే కిడ్నాప్ చేశారని ఛోక్సీ ఆరోపిస్తున్నారు. ఇంటర్​పోల్ రెడ్ కార్నర్ నోటీసులు రద్దు కావడం వల్ల.. ఛోక్సీ వాదనకు బలం చేకూర్చినట్లైందని ఆయన ప్రతినిధి పేర్కొన్నారు.

'పాత స్నేహితుడికి సాయం'
ఇంటర్​పోల్ రెడ్​కార్నర్ నోటీసులు వెనక్కి తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మండిపడ్డారు. బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దేశభక్తి గురించి మాట్లాడే వారే.. ఛోక్సీ లాంటి వ్యక్తులకు రక్షణ కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది హాస్యాస్పదమని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

"వేల కోట్ల రూపాయల దేశ సంపద నష్టపోయాం. 'తినను తిననివ్వను' అని చెప్పే మాటలు జుమ్లా అని తేలిపోయింది. ఈడీ-సీబీఐలు విపక్షాల కోసమే ఉన్నాయి. ప్రాణ స్నేహితుడి కోసం పార్లమెంట్​ను స్తంభింపజేస్తున్న అధికార పక్షం.. ఐదేళ్ల క్రితం పారిపోయిన పాత స్నేహితుడికి సాయం చేయకుండా ఉంటుందా?"
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

'ప్రభావం ఉండదు'
అయితే, మెహుల్ ఛోక్సీపై రెడ్​కార్నర్ నోటీసులను ఇంటర్​పోల్ ఉపసంహరించుకోవడం వల్ల.. అతడిపై ఉన్న కేసుల దర్యాప్తుపై ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఛోక్సీ కేసులు ఇప్పటికే కీలక దశకు చేరుకున్నాయని గుర్తు చేశాయి. 'దీనిపై ఒప్పందం అమలులో ఉంది. ఛోక్సీని అరెస్టు చేయగానే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి.. తగిన చర్యలు తీసుకుంటాం' అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రూ.13వేల కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మెహుల్‌ ఛోక్సీపై 2018లో ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులను జారీ చేసింది. 2017లోనే ఆంటిగ్వా పౌరసత్వం తీసుకుని.. 2018 నుంచి అక్కడే ఉంటున్న ఛోక్సీ పౌరసత్వం రద్దు చేయాలని భారత్‌ కోరినా ఆ దేశం ఒప్పుకోలేదు. ఛోక్సీ కిడ్నాప్ అయ్యారన్న వాదననూ భారత ప్రభుత్వం ఖండిస్తోంది. ఆయన్ను భారత అధికారులు కిడ్నాప్ చేయలేదని చెబుతోంది.

Last Updated : Mar 21, 2023, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.