ETV Bharat / bharat

'ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?' - మెహబూబా ముఫ్తీ వార్తలు

జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ శ్రీనగర్​లోని ఈడీ కార్యాలయానికి గురువారం విచారణకు హాజరయ్యారు. దేశంలో అసమ్మతిని తెలియజేయడమే నేరమైందన్నారు ముఫ్తీ.

mufti
'దేశంలో అసమ్మతిని నేరంగా పరిగణిస్తున్నారు'
author img

By

Published : Mar 25, 2021, 6:50 PM IST

ఎన్​ఐఏ, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు పీపుల్స్​ డెమోక్రెటిక్​ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ. ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారిపై దేశ ద్రోహం, మనీ లాండరింగ్​ కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అసమ్మతిని తెలియజేయడాన్ని దేశంలో నేరంగా పరిగణిస్తున్నారని విమర్శించారు.

శ్రీనగర్​లోని ఈడీ కార్యాలయానికి గురువారం విచారణకు హాజరైన మెహబూబా ఈ వ్యాఖ్యలు చేశారు.

"బిజ్​బెహ్రాలో నా పేరున, నా తండ్రి పేరున ఉన్న స్థలం విక్రయం, ముఖ్యమంత్రి నిధుల దుర్వినియోగంపై ప్రశ్నలు వేశారు. అసమ్మతిని దేశంలో నేరంగా పరిగణిస్తున్నారు. ఈ దేశం రాజ్యాంగం ద్వారా కాకుండా కేవలం ఓ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడుస్తోంది."

-మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత

మనీలాండరింగ్​ కేసులో ముఫ్తీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ముఫ్తీ సోమవారం (మార్చి 22) దిల్లీలోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఆ రోజు విచారణకు హాజరు కాలేనని, అవసరమైతే శ్రీనగర్​లోని తన నివాసంలో లేదా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ చేపట్టాలని కోరుతూ ఈడీకి లేఖ రాశారు.

దీంతో ఈడీ ముఫ్తీని శ్రీనగర్​లోని కార్యాలయంలో విచారించింది.

ఇదీ చదవండి : 'మోదీకి ఓటు వేస్తే స్కీములు- టీఎంసీతో స్కాములే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.