Meghalaya High Court: ఓ మైనర్పై అత్యాచారం కేసులో మేఘాలయ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననేంద్రియాలను లోదుస్తులపైనుంచి పురుషాంగంతో తాకినా.. అత్యాచారంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఇది పెనట్రేటివ్ సెక్స్ కిందికి వస్తుందని పేర్కొంది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ బెనర్జీ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్.
''మహిళ యోని లేదా మూత్రనాళంలోకి ఏదైనా చొప్పించడం.. శిక్షా స్మృతిలోని సెక్షన్ 375(బి) ప్రకారం అత్యాచారమే.''
- మేఘాలయ హైకోర్టు
2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 2018లో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
Rubbing Male Organ on Genitalia
కానీ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. తన వాదనను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపాడు. బాలికపై లైంగిక చర్యకు పాల్పడలేదని, లోదుస్తులపైనుంచి పురుషాంగంతో తాకానని చెప్పాడు.
బాధితురాలు కూడా తన వాంగ్మూలాన్ని మార్చి చెప్పడం గమనార్హం. తొలుత లోదుస్తులు తీసి అత్యాచారం చేశాడని చెప్పిన బాలిక.. కొద్దిసేపటి తర్వాత వేరేలా చెప్పింది.
అయినా.. వైద్య పరీక్షలు, నిందితుడు, బాధితురాలి వాంగ్మూలం పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. నిందితుడు శిక్షార్హుడేనని పేర్కొంది.
ఇవీ చూడండి: అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం