ETV Bharat / bharat

రైతు ఉద్యమానికి మేఘాలయ గవర్నర్ మద్దతు - meghalaya governor news

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు మేఘాలయ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. ఉద్యమంలో 250 మంది రైతన్నలు చనిపోయినా.. ఎవరూ మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. భాజపా కూటమిలోని అప్నాదళ్ ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి సైతం.. రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

Meghalaya governor Satya Pal Malik support to Farmers
రైతులకు మద్దతు తెలిపిన మేఘాలయా గవర్నర్​
author img

By

Published : Mar 18, 2021, 7:11 AM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతుల నిరసనకు తన మద్దతును తెలిపారు.

ఒక శునకం చనిపోతేనే ఎంతో మంది సంతాపం వ్యక్తం చేస్తారన్న మాలిక్​.. రైతు ఉద్యమంలో 250 మంది అన్నదాతలు చనిపోయినా ఎవరూ మాట్లాడలేదన్నారు. ఉద్యమం దీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే.. రాజస్థాన్‌, హరియాణా రాష్ట్రాలతో పాటు పశ్చిమ యూపీలోని పలు ప్రాంతాల్లో భాజపాకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని సత్యపాల్‌ మాలిక్‌ హెచ్చరించారు.

రైతుల ఆందోళనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో ఇప్పటికే చర్చించినట్లు మాలిక్ తెలిపారు. అన్నదాతలను ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదని అభిప్రాయపడ్డారు.

కూటమి ఎమ్మెల్యే సైతం..

మరోవైపు, యూపీలో అధికార భాజపా కూటమిలోని అప్నాదళ్ ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి సైతం.. రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ప్రజలు, రైతులకు కోపం వచ్చినా కేంద్రానికి పట్టనట్లు ఉందని ఆయన ధ్వజమెత్తారు. కొందరు పారిశ్రామికవేత్తలను అసంతృప్తికి గురిచేయటం ప్రభుత్వానికి ఇష్టంలేనట్లుందని విమర్శించారు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాల ప్రతులు హోలీ మంటల్లో దహనం చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.