అసోం ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ.. రాష్ట్ర రాజకీయాలు దిల్లీకి మారాయి. సీఎం రేసులో సర్బానంద సోనోవాల్, హిమాంత బిశ్వ శర్మ ఉండగా.. వారిద్దరూ శనివారం దిల్లీ పర్యటన చేపట్టారు.



హిమాంత బిశ్వ శర్మ, సర్బానంద సోనోవాల్.. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
అంతకుముందు.. అసోం సీఎం ప్రమాణ స్వీకారం శుక్రవారం ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. కానీ సీఎం ఎవరనే విషయం స్పష్టత లేని కారణంగా ఆ కార్యక్రమం జరగలేదు.
ఇదీ చదవండి : కరోనా కట్టడిలో ముంబయి భేష్!