ETV Bharat / bharat

డిగ్రీ వరకు అబ్బాయిలా .. పీజీలో అమ్మాయిలా మారి..

ట్రాన్స్​జెండర్​ అంటే యాచించడం, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం అనేభావన చాలా మందిలో ఉంటుంది. అయితే అలాంటి ఆలోచనలను పటాపంచలు చేస్తూ.. వారి పట్ల ఉన్న దృక్కోణాన్ని మార్చే ప్రక్రియకు శ్రీకారం చుటింది దీపు బుద్ధే. విద్యతో ట్రాన్స్​జెండర్ల జీవితాల్లో వెలుగు నింపేదందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో పీహెచ్​డీ చేస్తున్న తొలి ట్రాన్స్​జెండర్​గా గుర్తింపు పొంది.. తన వారికోసం పాటుపడుతోంది.

transgender pursues phd
transgender
author img

By

Published : Feb 1, 2022, 9:51 PM IST

దీపు

ట్రాన్స్​జెండర్​ అనగానే.. మనకు సంబంధంలేని వ్యక్తులు అనే భావన చాలామందిలో కలుగుతుంది. మెజారిటీ సమాజం వారికి దూరంగానే ఉంటోంది. అలాంటి భావనను దూరం చేసి.. సమాజంలో తామేమీ తక్కువ కాదని చాటి చెబుతోంది కర్ణాటకకు చెందిన ట్రాన్స్​జెండర్ దీపు బుద్ధే.

ట్రాన్స్​జెండర్ల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు పరిశోధక విద్యార్థిగా మారింది. కర్ణాటకలో పీహెచ్​డీ చేస్తున్న తొలి ట్రాన్స్​జెండర్​గా గుర్తింపు పొందింది దీపు బుద్ధే.

చామరాజనగర జిల్లాలోని హెగ్గవాడిపుర గ్రామానికి చెందిన దీపును చిన్నప్పుడు గురుస్వామి అని పిలిచేవారు. 8వ తరగతికి వచ్చాక తనలోని అమ్మాయి లక్షణాలను గుర్తించింది దీపు. డిగ్రీ వరకు అబ్బాయిలానే చదివింది.

ఆ తర్వాత ​ట్రాన్స్​జెండర్​గా మారింది. అప్పటినుంచి తనలో తాను కుమిలిపోయింది. డిప్రెషన్​లోకి వెళ్లింది. కొన్నాళ్లు యాచించింది. ఈ చీకటి రోజుల నుంచి కొద్ది రోజులకు బయటపడింది.

దూర విద్యలో ఏంఏ..

తనలో ధైర్యాన్ని కూడగట్టుకొని.. తనలాంటి వారి అభ్యున్నతికోసం ఏదైనా చేయాలనుకుంది. దీని కోసం చదువే ఏకైక మార్గం అని భావించింది. దూర విద్యలో ఎంఏ పూర్తి చేసింది. 80శాతం స్కోరుతో ఉత్తీర్ణత సాధించి పట్టా పొందింది.

ప్రొఫెసర్లు బాసటగా..

మైసూర్​ యూనివర్సిటీలోని డాక్టర్​ బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సెంటర్​లో పీహెచ్​డీ చేస్తోంది దీపు. 'మైసూర్​, చామరాజనగర జిల్లాల్లోని లింగపరమైన మైనారిటీల జీవనపోరాటం' అనే అంశంపై గత ఏడు నెలలుగా దీపు పరిశోధన చేస్తోంది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు.

అయితే అంబేడ్కర్ ఆలోచనలతోనే తాను స్ఫూర్తి పొందానని చెబుతోంది దీపు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, విద్యతోనే మార్పు సాధ్యమని అంటోంది. రాష్ట్రంలో పీహెచ్​డీ చేస్తున్న తొలి ట్రాన్స్​జెండర్​ అయినందుకు గర్వపడుతున్నానంటోంది దీపు బుద్ధే.

తన వాళ్ల బతుకులను చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చేందుకు దీపు చేస్తున్న ప్రయత్నం స్ఫూర్తిదాయకం. ఆమె జీవితం ఎందరికో చైతన్యం మార్గం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి:

పెళ్లయ్యాక భార్య.. మహిళ కాదని తెలిస్తే..

చావడానికి అనుమతి కోరితే.. బతకడానికి దారి చూపారు!

కోయంబత్తూర్ ట్రాన్స్​జెండర్ల పెయింటింగ్స్.. అమెరికాలో ఎగ్జిబిషన్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.