దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థ సన్నద్ధమవుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 21 నుంచి కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూర్ తాలుకాలో ట్రయల్స్ జరపనున్నట్లు పేర్కొంది. అయితే.. దీనికంటే ముందే.. రెండు డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా ట్రయల్స్ జరపుతోంది.
బెంగళూరుకు చెందిన టీఏఎస్ సంస్థ.. ఈ డ్రోన్ సరఫరాపై ట్రయల్స్ జరుపుతోంది. నారాయణ హెల్త్ కేర్ భాగస్వామ్యంతో.. 30-45 రోజుల పాటు మెడికల్ సరఫరా ట్రయల్స్ జరపనుంది టీఏఎస్.
రెండు డ్రోన్లు...
మెడ్ కాప్టర్, రాన్డింట్ అనే రెండు డ్రోన్లను ఈ సంస్థ ఉపయోగిస్తోంది. మెడ్ కాప్టర్ 15 కిలోమీటర్ల దూరం వరకు కేజీ బరువున్న వస్తువులను మోసుకెళ్లగలదు. రాండింట్.. 2 కేజీల బరువున్న వస్తువులను 12 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లగలదు. అయితే.. డ్రోన్లో చిన్న లోపాలు రావడం వల్ల ట్రయల్స్ మరింత ఆలస్యమైట్లు టీఏఎస్ సంస్థ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:డ్రోన్ల ద్వారా టీకాల సరఫరా!