ETV Bharat / bharat

Vikarabad Shirisha Murder Case update : శిరీష మృతిపై వీడని మిస్టరీ.. ఆత్మహత్యే అంటున్న పోలీసులు! - మెడికల్ విద్యార్థిని హత్య కేసు వార్తలు

Medical Student Shirisha Murder Case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లాకు చెందిన శిరీష మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొదట శిరీష మృతదేహాన్ని చూసి ఆమెను కిరాతకంగా ఎవరో హత్య చేశారని భావించిన పోలీసులు ఇప్పుడు రూట్ మార్చారు. ఇంట్లో జరిగిన గొడవే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరోవైపు గ్రామస్థులు మాత్రం శిరీషను ఎవరో హత్య చేశారని కచ్చితంగా చెబుతున్నారు. ఇంతకీ శిరీషని ఎవరైనా హత్య చేశారా..? లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా..? పోలీసులు చెప్పినట్లు ఇది ఆత్మహత్య అయితే మరి ఆమె గొంతు ఎలా తెగింది, ఆమె కళ్లు పొడిచిందెవరు.. కాళ్లకు ఆ కత్తి గాట్లు ఎలా పడ్డాయి? శిరీష ఎలా మరణించింది..? ఈ మిస్టరీ ఇప్పట్లో వీడుతుందా..?

Sirisha Murder Case Investigation
Sirisha Murder Case Investigation
author img

By

Published : Jun 13, 2023, 12:28 PM IST

శిరీష మృతిపై వీడని మిస్టరీ.. ఆత్మహత్యే అంటున్న పోలీసులు

Nursing Student Shirisha Murder in Vikarabad : రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన పారామెడికల్‌ విద్యార్థిని శిరీష హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఇప్పటివరకు హత్యగా అనుమానించిన పోలీసులు.. తండ్రి, బంధువులు చెప్పిన వివరాల మేరకు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. శిరీష మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్య నిపుణురాలు చెప్పిన విషయం విని.. కచ్చితంగా ఆమెది ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు. కానీ దీని వెనక ఉన్న కారణం మాత్రం స్పష్టంగా తెలియరావడం లేదు.

Medical Student Shirisha Murder Case news : ఇంట్లో జరిగిన గొడవే శిరీషను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నా.. గ్రామస్థులు మాత్రం కచ్చితంగా ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు ఎలా గాయాలవుతాయని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను హత్య చేసిన వారెవరో తండ్రికి తెలుసని.. అన్నీ తెలిసీ.. అతను శిరీష మరణాన్ని ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నాడని ఆరోపించారు. ఒక పక్క పోలీసులు కూడా ఆమెది ఆత్యహత్యే అని అంటున్నారు. అసలు శిరీషది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు.

Vikarabad Shirisha Brutal Murder : వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష మృతదేహానికి ఆదివారం వైద్యాధికారిణి వైష్ణవి పర్యవేక్షణలో పోస్టుమార్టం జరిగిన అనంతరం.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే శిరీష అక్క భర్త అనిల్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని మరోసారి పరిశీలించాలని పోలీసులు కోరడంతో వైద్యాధికారిణి కాడ్లాపూర్‌ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లడంతోనే శిరీష మృతి చెంది ఉంటుందని పోలీసులకు, గ్రామస్థులకు ఆమె వివరించారు.

Shirisha Murder Case in Vikarabad : ఒకవేళ శిరీష నిజంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. మరోసారి మృతదేహాన్ని పరీక్షించాల్సిన అవసరమేంటని గ్రామస్థులు పోలీసులను ప్రశ్నించారు. ఇదే సమయంలో తండ్రి జంగయ్యను నిలదీశారు. శిరీష మృతికి ఆయనే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపైకి దాడికి తెగబడటంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనాస్థలిలోనే ఉన్న ఎస్సై విఠల్‌రెడ్డి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Shirisha Murder Case Investigation : పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 10వ తేదీ రాత్రి శిరీషను.. ఆమె అక్క భర్త అనిల్, తండ్రి జంగయ్య కొట్టి ఆమె వద్ద ఉన్న ఫోన్‌ తీసుకున్నారు. దాంతో మనోవేదనతో ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించగా వారు అడ్డుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం కొద్దిసేపటికే శిరీష ఇంటినుంచి బయటకు వచ్చింది. ఇద్దరూ చేయి చేసుకోవడంతోనే మనస్తాపం చెంది కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్లకు కర్రలు తగిలి గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు. ఆమె మొబైల్​లో కాల్‌ లిస్టును సేకరించామని, అందులో ఆధారాలేవీ లేవని అన్నారు.

మరోవైుపు శిరీష మృతిపై సమగ్ర వివరాలతో మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ డీజీపీని కోరారు. బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీకి ఛైర్‌పర్సన్‌ లేఖ రాసినట్లు ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్‌ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.