భారత్‌ను 'పాక్షిక స్వేచ్ఛాయుత' ప్రజాస్వామ్య దేశంగా తగ్గిస్తూ ఫ్రీడమ్ హౌస్ అనే ఎన్జీఓ ఇచ్చిన నివేదికపై విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది. ఆ సంస్థకు నిధులు సమకూర్చిన అమెరికాపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ ఉత్తమ ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తోందని ఇతరుల నీతి సూక్తులు పాటించే స్థితిలో లేదని స్పష్టం చేసింది.
దురుద్దేశంతోనే నివేదిక..
డెెమొక్రసీ వాచ్డాగ్ 'ఫ్రీడమ్ హౌస్' అనే అంతర్జాతీయ సంస్థ.. భారతదేశాన్ని స్వేచ్ఛాయుత స్థానం నుంచి పాక్షిక స్వేచ్ఛ కలిగిన దేశంగా కుదించింది. అదే సమయంలో ఇక్కడ పౌరహక్కుల కోసం నిరంతర సంఘర్షణ జరుగుతోందని తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను రాజకీయ దురుద్దేశాలతో కూడిన నిరాధారమైన ఆరోపణలుగా భారత విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అభివర్ణించారు. భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించడంపైనా మండిపడ్డారు.
''భారతదేశంలో బలమైన ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంది. ఉత్తమ పద్ధతులను పాటిస్తున్నాం. ఇతరుల ఉపన్యాసాలు వినే స్థితిలో భారత్ లేదు.''
-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ అధికార ప్రతినిధి.
కరోనాపై పోరులో ముందున్న భారత్.. ప్రపంచ దేశాల మన్ననలు పొందిందని శ్రీవాత్సవ తెలిపారు. అధిక రికవరీ రేటుతో పాటు.. తక్కువ మరణాల నమోదుపై ప్రశంసలు వెల్లువెత్తాయని వివరించారు.
ఇదీ చదవండి: 'పాక్‌తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నాం'