భారత్లో కరోనా కేసుల సంఖ్య శనివారం అమాంతంగా పెరిగింది. 83 రోజుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో.. దేశంలో కరోనా కొత్త వేవ్ వచ్చే అవకాశముందని.. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం సహా కరోనా నిబంధనలను పాటించడం వల్ల దానిని అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
దేశంలో తాజాగా 24వేల 882 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డిసెంబర్ 20 నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి.
"కరోనా కేసులు గణనీయంగా వెలుగు చూస్తున్నాయి. ఈ ఉద్ధృతిని ఆపాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు టీకాలు వేయడాన్ని కూడా పెంచాలి."
-అనురాగ్ అగర్వాల్ , సీఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరక్టర్
"కరోనా కేసుల సంఖ్యను సూచించే రేఖ క్రమక్రమంగా పెరుగుతోంది. ఇది మిగతా దేశాలతో పొల్చితే కొంచెం తక్కువే. కానీ మరోసారి కొవిడ్ ఉద్ధృతి పెరగకుండా జాగ్రత్తపడాలి."
-మౌనికా గులాటి, మెడికల్ సైన్సెస్ డీన్- లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ
ఇదీ చూడండి: వైరస్ విజృంభణ- ఔరంగాబాద్లోనూ వారాంతాల్లో లాక్డౌన్