ప్రముఖ షియా మతాధికారి, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్ (83) మంగళవారం తుదిశ్వాస విడిచారు. లఖ్‌నవూలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 10 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు కాల్బే సబ్టేయిన్ తెలిపారు.
అనారోగ్య కారణాలతో నవంబర్ 17న ఐసీయూలో చేరారు మౌలానా. మంగళవారం హెల్త్‌బులిటెన్ విడుదల చేసిన క్రమంలో మౌలానా.. పెద్ద పేగు క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన న్యుమోనియా, యూటీఐ, సెప్టిక్ షాక్, మెటాస్టాసిస్తో వంటి వాటితో బాధపడుతున్నట్లు వెల్లడించారు వైద్యులు.
మౌలానా సాదిక్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి:'లవ్ జిహాద్'పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్