ETV Bharat / bharat

అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్ నిర్మాణం​.. లక్ష్యం కోసం 50 ఏళ్లు శ్రమించిన వృద్ధుడు!

అనుకున్న లక్ష్యం కోసం నాలుగైదేళ్లు ప్రయత్నించి విసిగి వేసారే వారిని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తాను అనుకున్నది సాధించడం కోసం ఏకంగా 50 ఏళ్లకు పైగా శ్రమించాడు. ఫలితంగా ఒక్కడే ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్​ టవర్​ను అగ్గిపుల్లలతో నిర్మించాడు. మరి దాన్ని ఎక్కడ.. ఎలా కట్టాడో తెలుసుకుందామా మరి..!

matchstick eiffel tower
matchstick eiffel tower
author img

By

Published : Feb 28, 2023, 10:20 AM IST

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి 72 ఏళ్ల వయస్సులో ఈఫిల్​ టవర్​ను నిర్మించాడు. అయితే దీనిలో విశేషమేముంది అనుకుంటే పొరపాటే.. అతను తయారు చేసింది ఇనుము, ఉక్కును ఉపయోగించి కాదు.. అగ్గిపుల్లలతో. 75,000 అగ్గిపుల్లలను ఉపయోగించి ఈ మినీ ఈఫిల్​ టవర్​ను సిద్ధం చేశాడు. దీన్ని తయారు చేయడం కోసం దాదాపు 50 ఏళ్లకు పైగా శ్రమించాడు సురేంద్ర జైన్​. మరి ఆ జైన్​ కథేంటో తెలుసుకుందామా.

మేరఠ్​కు చెందిన 72 సంవత్సరాల సురేంద్ర జైన్​ ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. అతడికి పార్తాపుర్​లో ఓ పిండి మిల్లు ఉంది. అయితే జైన్​ చదువుకునే రోజుల్లో.. అతడి తల్లి చదువుతో పాటు వేరే ఏదైనా చేసి గుర్తింపు తెచ్చుకోమనేది. దీంతో జైన్ చిన్నప్పుడే అగ్గి పుల్లలతో ఈఫిల్​ టవర్​ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్​ టవర్​ తనని ఎంతగానో ఆకర్షించేదని చెప్పాడు. అప్పట్లో దాని కోసం అని కొన్ని వందలసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా సరే టవర్​ను ఎప్పటికైనా సిద్ధం చేయాలనే లక్ష్యంతో.. వ్యాపారం చేస్తున్నా సరే ప్రత్యేక సమయం కేటాయించేవాడు. దీన్ని తయారు చేయడం కోసం తన ఇంట్లోనో ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకున్నాడు జైన్​. ఈ గదిలో గాలి ఎక్కువగా రాకుండా, దుమ్ముధూళి పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు.

matchstick eiffel tower
అగ్గిపుల్లలతో సురేంద్ర జైన్​ తయారు చేసిన ఈఫిల్ టవర్​
matchstick eiffel tower
తాను తయారు చేసిన ఈఫిల్​ టవర్​ను చూపిస్తున్న సురేంద్ర జైన్​

ఫ్రాన్స్​ పర్యటనలో రెండురోజులు అక్కడే..
జైన్​ తాను అనుకున్నది ఎలా అయినా సాధించాలనే లక్ష్యంతో 2013లో ఫ్రాన్స్​కు వెళ్లాడు. అక్కడకు చేరుకున్నాక ఈఫిల్ టవర్​ ముందు కూర్చుని రెండు రోజులపాటు దాన్ని చూస్తూనే ఉన్నాడు. అక్కడే ఉండడం వల్ల మరింత స్ఫూర్తి పొందాడు జైన్. టవర్​కు సంబంధించి పూర్తి సమాచారం సేకరించి భారత్​ చేరుకున్న జైన్.. దాన్ని తయారు చేయడం కోసం ఓ మ్యాప్​ను సిద్ధం చేసుకున్నాడు. దీనిలో భాగంగానే దాదాపు 1,100 అడుగుల పొడవుండే.. ఈఫిల్​ టవర్ మాదిరిగానే 5 అడుగుల టవర్​ను అదే ఆకృతిలో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ప్రయత్నాలు చేసినా సరే దాన్ని నిర్మించడంలో విజయం సాధించలేక పోయాడు.

matchstick eiffel tower
తాను తయారు చేసిన ఈఫిల్​ టవర్​తో సురేంద్ర జైన్​

జైన్​ 2019 నుంచి తన పూర్తి దృష్టంతా అగ్గిపుల్లలతో ఈఫిల్​ టవర్​ను తయారే చేయడంపైనే కేంద్రీకరించాడు. అయితే జైన్​కు ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చిపడింది. వయసు మీద పడడం వల్ల జైన్​కు చేతులు వణుకు సమస్య ఎదురైంది. దీంతో అగ్గిపుల్లలకు గమ్మును అంటించి.. అవి ఒకదానితో ఒకటి అతుక్కునే వరకు అలా పట్టుకోవడం ఇబ్బంది అయ్యేది. కానీ జైన్​ మాత్రం తాను అనుకున్న లక్ష్యం కోసం.. వణుకుని జయించడానికి యోగాలో శిక్షణ తీసుకున్నాడు. ఫలితంగా కొన్ని రోజులకు ఆ సమస్యను ఓడించాడు. అదే పట్టుదలతో మళ్లీ ప్రయత్నాలు చేసి చివరికి 75,000 అగ్గిపుల్లలతో ఈఫిల్​ టవర్​ను నిర్మించాడు. ప్రస్తుతం తాను తయారు చేసిన టవర్​ను చూడడాని చుట్టుపక్కల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని జైన్​ తెలిపాడు. దేశంలో మరెక్కడా అగ్గిపుల్లలతో నిర్మించిన ఈఫిల్​ టవర్ లేదని జైన్​ వెల్లడించారు. జైన్ ఇప్పుడు​ దీనిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైనవాటికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాడు.

matchstick eiffel tower
75,000 అగ్గిపుల్లలతో జైన్​ తయారు చేసిన ఈఫిల్​ టవర్​
matchstick eiffel tower
ఈఫిల్ టవర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.