సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళనలు 47 రోజుకు చేరుకున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసే వరకు ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. రోజుకో రీతిలో రైతులు వినూత్నంగా తమ నిరసన తెలుపుతున్నారు. ఈనేపథ్యంలో జనాలను ఇంకా పోగుచేయడానికి గాజీపూర్ సరిహద్దులో కుస్తీ పోటీలు నిర్వహించారు రైతులు.
కుస్తీ పోటీలను చూడడానికి మారుమూల ప్రాంతాలనుంచి చాలా మంది అక్కడికి చేరుకున్నారు. పోటీలను భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికౌత్ సందర్శించారు. సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం సరైన అవగాహనతో లేదని విమర్శించారు టికౌత్.
రైతులు నిర్వహిస్తున్న కుస్తీ పోటీల్లో వారి కుటుంబ సభ్యలే ఉన్నారని అన్నారు. ఒకసారి ఇక్కడ జరుగుతున్న కుస్తీ పోటీలను చూడండి రైతులు చేస్తోన్న ఆందోళనలు నిజమైనవో కావో అని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
![Massive crowd gathered to watch dangal for farmers protest at Ghazipur border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10195085_3.jpg)
![Massive crowd gathered to watch dangal for farmers protest at Ghazipur border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10195085_1.jpg)
![Massive crowd gathered to watch dangal for farmers protest at Ghazipur border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10195085_2.jpg)
ఇదీ చూడండి: 'జాన్సన్ పర్యటన రద్దు మా విజయమే'