ETV Bharat / bharat

ఒకేసారి 9 జంటల పెళ్లి.. రాజ్యాంగ పీఠికపై ప్రమాణం.. అంబేడ్కర్​, బుద్ధుని ఫొటోలతో మండపానికి.. - ఒకే రోజు ఒక్కటైన 9 జంటలు

బౌద్ద సంప్రదాయం ప్రకారం 9 జంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి. ఈ సామూహిక వివాహాలు గుజరాత్​లో జరిగాయి. అయితే నూతన వధూవరులు అంబేడ్కర్​, బుద్ధుని విగ్రహాలు పట్టుకుని వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం దంపతులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు.

mass wedding ceremony in Junagadh
సామూహిక వివాహాలు
author img

By

Published : Feb 28, 2023, 12:52 PM IST

ఒకేసారి 9 జంటల పెళ్లి.. రాజ్యాంగ పీఠికపై ప్రమాణం.. అంబేడ్కర్​, బుద్ధుని ఫొటోలతో మండపానికి..

గుజరాత్​లోని జునాగఢ్​లో 9 జంటలు ఒకే రోజు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి. సమ్యక్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. అయితే ఈ వివాహ వేడుక బౌద్ధ సంప్రదాయం ప్రకారం జరిగింది. నూతన వధూవరులు బాబాసాహెబ్ అంబేడ్కర్​, బుద్ధుడి ఫొటోలు చేతిలో పట్టుకుని పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. పెళ్లి మండపం వద్ద అంబేడ్కర్​, గౌతమ బుద్ధుడి విగ్రహాలను ఉంచారు నిర్వహకులు. వివాహం అనంతరం నూతన వధూవరులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. జీవితాంతం కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ పెళ్లిలో ఎక్కడా వరుడు.. వధువుకు మంగళసూత్రం కట్టలేదు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. నాలుగేళ్లుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని సమ్యక్ సేవా సమితి నిర్వహకులు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల జంటలు ఈ సామూహిక వివాహంతో ఒక్కటయ్యాయని వెల్లడించారు. ఈ విహహాలను బుద్ధ సమూహ లగ్న సేవా సమితి, సమ్యక్ సేవా సమితి కలిసి నిర్వహించాయి.

mass marriage ceremony gujarat
వివాహ వేదిక వద్దకు వస్తున్న నూతన వధూవరులు
mass marriage ceremony gujarat
వేదిక వద్ద నూతన వధూవరులు

ఒక్కటైన 3,003 జంటలు..
గతేడాది నవంబరులో ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం గాజియాబాద్​లో సామూహిక వివాహాలు జరిపించింది. 'ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్​ యోజన' కింద వివిధ మతాలకు చెందిన 3,003 జంటలకు పెళ్లి జరిపించింది. ఈ వివాహ వేడుకలో ఒక్కటైనవారికి ప్రభుత్వం పెళ్లి దుస్తుల కోసం రూ. పది వేలు ఇవ్వగా.. వధువుల ఖాతాల్లోకి రూ.65,000 నగదు జమ చేసింది. గాజియాబాద్​లోని నెహ్రూ పార్క్​లో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రి అనిల్ రాజ్‌భర్, కేంద్ర సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ హాజరయ్యారు.

ఈ సామూహిక వివాహ వేడుకలో హాపుడ్, గాజియాబాద్​, బులంద్​శహర్​కు చెందిన 3,003 జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. అందులో గాజియాబాద్​కు చెందిన 1,654 జంటలు, 794 మంది హాపుడ్​, 555 మంది బులంద్‌శహర్‌కు చెందిన జంటలని అధికారులు వెల్లడించారు. 1,147 ముస్లిం, 1,850 హిందువుల జంటలు ఉన్నాయి. సిక్కు. బౌద్ధ మతానికి చెందిన చెరో 3 జంటలు సామూహిక వివాహకార్యంలో పాలుపంచుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి అనిల్‌ రాజ్‌భర్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.