ETV Bharat / bharat

మాస్కులు, వెంటిలేషన్​ ఉంటే చాలు! - శాస్త్రవేత్తలు

గదిలో గాలి ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించడానికి భౌతిక దూరం పాటించడం కన్నా మాస్కులు ధరించడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలుపేర్కొన్నారు. కంప్యూటర్ నమూనా సాయంతో వారు లెక్కలు కట్టి ఈ మేరకు తేల్చారు.

Masks
మాస్కులు
author img

By

Published : Apr 7, 2021, 7:36 AM IST

గదిలో గాలి ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించడానికి భౌతిక దూరం పాటించడం కన్నా మాస్కులు ధరించడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని శాస్త్ర వేత్తలు పేర్కొన్నారు. కంప్యూటర్ నమూనా సాయంతో వారు లెక్కలు కట్టి ఈ మేరకు తేల్చారు. అమెరికాలోని యూనివ ర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుడితో కూడిన ఒక తరగతి గదిని కంప్యూటర్ పై సృష్టించారు. అందులో విద్యార్థులు మాస్కు ధరించినట్లు చూపారు. వారిలో ఒకరికి ఇన్ ఫెక్షన్ ఉండొచ్చన్న అంచనాతో లెక్కలు కట్టారు. మాస్కు ధరించిన టీచర్ ను ముందుభాగంలో నిలిపారు. అనంతరం 'వెల్స్ రిలే అండ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్' సాయంతో విశ్లేషణలు సాగించారు.

మాస్కులు ధరించడం వల్ల గాల్లోని ఏరోసాల్ రేణువులకు గురికా కుండా రక్షణ లభిస్తుందని తేల్చారు. శ్వాస ద్వారా వెలువడే వేడిగా లిని అవి చాలా వరకూ తగ్గిస్తాయని పరిశోధనలో పాలుపంచుకున్న మైఖేల్ కింజెల్ తెలిపారు. "ఏరోసాల్ రేణువులను ఈ వేడిగాలి ముందుకు నెడుతుంది. మాస్కుల వల్ల దీనికి అడ్డుకట్ట పడుతుంది ఫలితంగా ఆ రేణువులు.. పక్కనున్న విద్యార్థులను చేరబోవు" అని వివరించారు. మంచి ఫిల్టర్ తో కూడిన వెంటిలేషన్ వల్ల గదిలో ఇన్ ఫెక్షన్ వ్యాప్తి 40 నుంచి 50 శాతం వరకూ తగ్గుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: 'మహా'లో కరోనా పంజా- కొత్తగా 55 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.