ETV Bharat / bharat

వివాహితకు మద్యం తాగించి.. ఆపై..! - యూపీ అత్యాచార వార్తలు

ఓ మహిళకు ముగ్గురు దుండగులు మద్యం తాగించి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగు చూసింది.

Married woman made to drink alcohol, raped by 3 in UP
వివాహితకు మద్యం తాగించి.. ఆపై ముగ్గురు అత్యాచారం
author img

By

Published : Mar 11, 2021, 8:48 AM IST

ఉత్తరప్రదేశ్​లో మరో దారుణ ఘటన బయటపడింది. పీలీభీత్​లోని ఓ వివాహితకు ముగ్గురు వ్యక్తులు మద్యం తాగించి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు నిందితుల(పవన్​ కుమార్​, చోటె, ఉమేశ్​)ను అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు.

అత్యాచారం విషయంపై బాధిత మహిళ కొత్వాలి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకరు తమ పొరుగువారేనని.. తొలుత తనను వాళ్ల తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళతానని చెప్పినట్టు ఆమె పేర్కొంది. ఆ తర్వాత.. అతడితో పాటు మరో ఇద్దరు సన్నిహితులు కలిసి మద్యం తాగించి, తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. అనంతరం.. తనను నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లిపోయినట్టు బాధితురాలు పేర్కొంది.

ఇదీ చదవండి: మృత్యుకోరల్లో మృగరాజు- సింహాలపై వైరస్ పంజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.