రాజస్థాన్లో ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఆమె శనివారం సాయంత్రం సొంతూరికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది.
ఏం జరిగిందంటే?
బాడ్మేర్ జిల్లాకు చెందిన ఓ వివాహిత తన బిడ్డతో పాటు ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ నగరంలో నివాసముంటోంది. వారాంతం కావడం వల్ల.. సమీపంలోని స్వగ్రామానికి బయల్దేరింది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆమెను వెంబడించారు. అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటన సమయంలో తన బిడ్డను బంధించడం సహా.. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారని బాధితురాలు పేర్కొంది.
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఓ నిందితుడ్ని అరెస్టు చేశారు పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కరోనాను లెక్కచేయకుండా హోలీ వేడుకలు