ETV Bharat / bharat

Gang Rape: ఫ్రెండ్​ పిలిచిందని కారులో వెళ్లింది.. ఆ తర్వాత మత్తు మందు ఇచ్చి.!

Married Woman Gang Rape In Warangal: పని చూపిస్తానని నమ్మించి.. కారులో తీసుకెళ్లి వివాహిత జీవితాన్ని నాశనం చేసింది మరో మహిళ. ఈ క్రమంలోనే బాధితురాలికి మత్తు మందు ఇచ్చి.. అయిదుగురు నిందితులు గ్యాంగ్​ రేప్​కు పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్​ జిల్లాలో చోటుచేసుకొంది.

warangal gang rape
warangal gang rape
author img

By

Published : May 3, 2023, 10:49 AM IST

Married Woman Gang Rape In Warangal: ఈరోజుల్లో ఆడవారి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన సరే.. వారిపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక మూల అబలలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా వరంగల్​ జిల్లాలోని జరిగిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఒక వివాహితపై అయిదుగురు యువకులు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.

వరంగల్​ జిల్లా మామునూరు ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్​ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పైడిపల్లికి చెందిన వివాహిత హనుమకొండలోని ఓ కర్రీ పాయింట్​లో పని చేస్తుంది. గత నెల 20న స్నేహితురాలు నుంచి ఆరెపల్లిలో పని ఉందని ఫోన్​ చేసి రమ్మని చెప్పింది. ఈ విషయం భర్తకు చెప్పగా బైక్​పై తీసుకువెళ్లి.. అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అప్పటికే అక్కడ ఆమె కోసం స్నేహితురాలు ఎదురు చూస్తోంది. అక్కడ వారిద్దరు కాసేపు ఎదురు చూసి.. కారు రావడంతో అందులో ఎక్కి వెళ్లిపోయారు. అందులో సురేశ్​, నాగరాజు ఇద్దరు నిందితులు ఉన్నారు. ఆ కారు ములుగు జిల్లా అటవీ ప్రాంత సరిహద్దుకు వెళ్లిన తర్వాత ఆమె స్నేహితురాలు అక్కడే దిగిపోయింది.

Five Persons Who Raped Married Woman: ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతంలో మరో ముగ్గురు ఎ. రమేశ్​, బి. లక్ష్మణ్​, బి. సుధాకర్​లు కారులోకి ఎక్కారు. కారులో ఉన్న మహిళకు అప్పటికే మత్తు మందు ఇచ్చి ఉన్నారు. దీంతో ఆమె స్పృహ తప్పగా.. మెలకువ వచ్చే సరికి కారు మేడారం అటవీ ప్రాంతానికి చేరుకొంది. ఆ ప్రాంతంలో రవి, నాగరాజు, లక్ష్మణ్​ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు వారికి సహకరించారు. అనంతరం అత్యాచారం జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తామని ఆ అయిదుగురు నిందితులు ఆమెను బెదిరించారు. ఆ తర్వాత బాధితురాలిని వారు ములుగలో బస్సు ఎక్కించి.. పంపించేశారు.

ఆరెపల్లి వద్ద బస్సు దిగిన అత్యాచారానికి గురైన మహిళ.. భర్తకు ఫోన్​ చేయగా.. ఎందుకు ఆలస్యమైందని మందలించాడు. ఆ మాటతో తను కరీంనగర్​లోని రామడుగులో ఉండే తల్లి ఇంటికి వెళ్లిపోయింది. రెండు, మూడు రోజులైన భార్య ఇంటికి రాకపోవడంతో.. భర్తకు భయం వేసి ఏప్రిల్​ 25న ఎనుమాముల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తును ప్రారంభించారు. ఇదే క్రమంలో బాధితురాలు కులపెద్ద సహకారంతో భర్త వద్దకు వచ్చి.. తనకు జరిగిన విషయం మొత్తం ఆ మహిళ చెప్పింది.

Warangal Gange Rape: దీనితో ఏప్రిల్​ 29న ఎనుమాముల పోలీస్​ స్టేషన్​లో ఆ ఐదుగురిపై తన భర్త ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు.. ఆ నిందితులను పట్టుకుని.. వారిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి.. రిమాండ్​కు తరలించారు. బాధితురాలి స్నేహితురాలు మాత్రం పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.