ETV Bharat / bharat

సోషల్​ మీడియాలో స్నేహం.. ఆ వీడియోలతో బెదిరించి అత్యాచారం! - rajasthan rape news

రాజస్థాన్​లో ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అశ్లీల వీడియోలను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తామని బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు బాధితురాలితో సోషల్​ మీడియాలో స్నేహం చేసి దగ్గరయ్యాడు.

gangrape-with-married-woman-in-churu
వివాహితతో ఫ్రెండ్​షిప్​.. అశ్లీల వీడియోలతో బ్లాక్​ మెయిల్​ చేసి అత్యాచారం!
author img

By

Published : Apr 21, 2022, 12:47 PM IST

Rajasthan rape news: రాజస్థాన్​ చురూ జిల్లాకు చెందిన ఓ మహిళ తనపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. తన అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బెదిరించి.. నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. పోలీసులు నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Married woman raped: 27ఏళ్ల బాధితురాలు చెప్పిన వివరాలు ప్రకారం.​​. ఆమెకు 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఐదు నెలల క్రితం ఓ యువకుడితో ఆన్​లైన్​లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి రోజూ వీడియో కాల్​ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆశ్లీల దృశ్యాలను అతడు రికార్డు చేశాడు. గతేడాది డిసెంబర్​లో ఓ చోటుకు రమ్మని ఆమెకు ఫోన్ చేశాడు. అతను చెప్పిన చోటుకు బాధితురాలు వెళ్లింది. అనంతరం ఆమె ఫోన్​ నుంచి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను తన ఫోన్​లోకి పంపించుకున్నాడు నిందితుడు. ఈ ఏడాది జనవరిలో నిందితుడు బాధితురాలి అత్తవారింటికి కూడా వెళ్లాడు. చనిపోయిన తన సోదరుడి స్నేహితుడని ఇంట్లో వాళ్లకి అతడ్ని పరిచయం చేసింది ఆమె. అయితే ఐదు రోజుల క్రితం మళ్లీ నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పి బెదిరించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. నిందితుడు మొదట తన సోదరి ఇంటికి, ఆ తర్వాత బంధువుల ఇంటికి బాధితురాలిని తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గంగానగర్​లోని తన స్నేహితుడు అస్లాం ఇంటికి కూడా తీసుకెళ్లాడు. అస్లాం కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అస్లాం బంధువుల ఇంటికి ఆమెను తీసుకెళ్లారు. అప్పటికే ఆమె కన్పించడం లేదని కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు రంగంలోని దిగి ఆమె అస్లాం బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకోగా.. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు చెప్పింది.

Churu rape case: అయితే నిందితుడు తన మతం పేరు దాచి.. తనతో స్నేహం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అతని పేరు సందీప్​ సింగ్​ రాఠోడ్​ అని రాజ్​గఢ్​లో నివసిస్తానని తనతో సోషల్ మీడియాలో చెప్పాడని, కానీ అతని పేరు అది కాదని.. అస్లాం ఇంటికి వెళ్లాకే తనకు తెలిసిందని చెప్పింది. నిందితుని అసలు పేరు దాతారామ్​ ధాణక్​ అని, నివసించేది కూడా రాజ్​గఢ్​లో కాదని, తరానగర్​లో అని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: దేశాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన రష్యా అమ్మాయి, ఝార్ఖండ్ అబ్బాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.