ETV Bharat / bharat

వరుడికి కరోనా.. ఆన్​లైన్​లోనే వివాహం

author img

By

Published : Apr 27, 2021, 5:49 PM IST

కరోనా కారణంగా వివాహాలు వినూత్నంగా జరుగుతున్నాయి. జూమ్ యాప్​లు, సామాజిక మాధ్యమాలే పెళ్లికి వేదికలవుతున్నాయి. తాజాగా.. ఉత్తరాఖండ్​లో ఇలాంటి ఘటనే జరిగింది. వరుడికి కరోనా సోకడం వల్ల వివాహాన్ని ఆన్​లైన్​లో నిర్వహించారు కుటుంబ సభ్యులు.

marriage conducted online
వరుడికి కరోనా.. ఆన్​లైన్​లోనే వివాహం

కరోనాతో ఆచార వ్యవహారాల్లోనూ అనేక మార్పులు వస్తున్నాయి. ఉత్తరాఖండ్​లోని అల్మోడా జిల్లాలో వధూవరులు ఒక్కచోట లేకున్నా వివాహం జరిగిపోయింది. పెళ్లి తతంగం అంతా ఆన్​లైన్​లోనే పూర్తైంది.

ఇదీ జరిగింది

జయంతి మండలంలోని ల్వాలి గ్రామానికి చెందిన ఉమేశ్ సింగ్ ధోనీకి.. కాందే గ్రామానికి చెందిన మంజు కన్యాల్​తో వివాహం నిశ్చయమైంది. ప్రస్తుతం లఖ్​నవూలో నివాసం ఉంటున్న ఉమేశ్.. పెళ్లికి ముందు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో అతనికి పాజిటివ్​గా తేలింది. కుటుంబ సభ్యుల్లో కొందరు కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో వీరంతా క్వారంటైన్​కు వెళ్లారు.

ఏప్రిల్ 24 కరోనా పరీక్ష ఫలితం రాగా.. అంతకుముందు రోజే వధూవరుల కుటుంబ సభ్యులు తమ ఇళ్లల్లో గణపతి పూజ నిర్వహించారు. మరుసటి రోజు వివాహం జరగాల్సి ఉండగా.. ఇలా కావడంపై ఇరువురు కుటుంబాలు నిరాశతో ఉన్నాయి. గణపతి పూజ చేసిన తర్వాత పెళ్లి వాయిదా వేయడం మంచిది కాదని వీరి నమ్మకం. దీంతో పురోహితులను సంప్రదించి ఆన్​లైన్ ద్వారా పెళ్లిని కానిచ్చేశారు.

వరుడు ఉమేశ్ లఖ్​నవూలో ఉండగా.. పెళ్లికూతురు మంజు కాందే గ్రామంలో ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న 450 కి.మీ దూరాన్ని ఇంటర్నెట్ భర్తీ చేసింది. వధూవరులకు అంతర్జాలమే వివాహ మండపమైంది. వివాహ తంతు ఏప్రిల్ 24న రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిందని పెళ్లికూతురు మంజు తెలిపింది.

ఇదీ చదవండి- స్ట్రెచర్​ లేక స్కూటీపైనే ఐసీయూకు కొవిడ్ రోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.