స్వలింగ వివాహాలను చట్ట ప్రకారం గుర్తించడం కుదరదని దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. పెళ్లి అనేది ఇద్దరు స్వతంత్ర వ్యక్తుల మధ్య జరిగేదికాదని అది స్త్రీ, పురుషుడికి మధ్య జరిగే గొప్ప కార్యమని పేర్కొంది.
కొత్త చట్టం చేస్తేనే స్వలింగ వివాహాల గుర్తింపు సాధ్యం అవుతుందని కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ కొత్త హక్కులను కోర్టులు కల్పించలేవని తెలిపింది. స్వలింగ వివాహాలను... హిందూ వివాహ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద గుర్తించాలంటూ హక్కుల కోసం పోరాడే ఓ కార్యకర్త కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా వివరణ ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
ఇదీ చదవండి:ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం