ETV Bharat / bharat

Margadarsi Chitfunds: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్ల సేకరణపై దాఖలైన కేసు.. విచారణ సెప్టెంబరు 26కు వాయిదా - Margadarsi Chits Case Today News

Margadarsi Chitfunds Case: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ డిపాజిట్ల సేకరణపై దాఖలైన కేసు విచారణను సెప్టెంబరు 26కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

Margadarsi Chits Case in Supreme Court
సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు
author img

By

Published : Jul 19, 2023, 7:34 AM IST

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్ల సేకరణపై దాఖలైన కేసు.. విచారణ సెప్టెంబరు 26కు వాయిదా

Margadarsi Chitfunds Cases Update: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ డిపాజిట్ల సేకరణపై దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 26కి వాయిదా వేస్తూ...ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ ప్రారంభమైన వెంటనే జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుంటూ మీరు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారా అని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ను అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ రిజాయిండర్‌ దాఖలుచేసినట్లు చెప్పారు.

ఈ కేసుకు సంబంధించిన ప్రొపొజిషన్స్‌ ఉన్నాయని, గతంలో వాటిని సర్క్యులేట్‌ చేయలేదని, ధర్మాసనం అనుమతిస్తే ప్రొపొజిషన్స్‌, కేస్‌ లాను సర్క్యులేట్‌ చేస్తామని చెప్పారు. అప్పుడు మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే జోక్యం చేసుకుంటూ ‘‘కేసు నమోదైన తర్వాత జరిగిన పరిణామాలను అధికారికంగా ధర్మాసనం ముందుకు తీసుకురావాలన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత విచారణ తెలంగాణలో జరగనున్నందున ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయ పరిధి ఉంటుందా.. లేదా అన్నది చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందులో పార్టీగా ఉన్నా వారు పట్టించుకోవడం లేదన్నారు.

ఆంధ్రాలో తొలినుంచీ రాజకీయ యుద్ధం జరుగుతోందన్న ఆయన.. అందుకు సాక్ష్యాధారాలను మేం చూపగలమని దీనిపై అప్లికేషన్‌ దాఖలు చేసామని ధర్మాసనానికి విన్నవించారు. మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ స్పందిస్తూ 2.7 లక్షల మంది డిపాజిటర్లకు డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించిన వివరాలను పూర్తిగా కోర్టుకు సమర్పించామని చెప్పారు. మరో సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా స్పందిస్తూ ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదన్నారు. ప్రస్తుతం ఈ కేసు పూర్తిగా భిన్న స్వరూపాన్ని సంతరించుకున్న విషయాన్ని రెండు పేజీల నోట్‌ రూపంలో సమర్పిస్తామని సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించిన జస్టిస్‌ సూర్యకాంత్‌ మార్గదర్శి సంస్థతో పాటు, ఏపీ ప్రభుత్వం, ఫిర్యాదుదారు కూడా తమ వాదనలను రెండు వారాల్లోపు నోట్‌ రూపంలో క్లుప్తంగా సమర్పించడానికి అంగీకరిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 26కి వాయిదా వేశారు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను తెలంగాణ హైకోర్టు విచారించడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ ఎస్‌.వి. భట్‌ లేని ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ఆదేశించారు. మంగళవారం ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనంపై ఉన్న జస్టిస్‌ భట్‌ ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అని చెప్పడంతో ఆ కేసులను ఆయన సభ్యుడిగా లేని ధర్మాసనానికి బదిలీచేయాలని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులను రెండు వారాల పాటు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ కోరగా, అందుకు మార్గదర్శి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ కేసు పెండింగ్‌లో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఉన్న కేసులు విచారణకు రాకుండా పదేపదే మెమోలు దాఖలు చేస్తోందని తెలిపారు. వాళ్లు అక్కడ కేసుల విచారణను వాయిదా వేస్తున్నారని మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. మార్గదర్శి తరఫున హాజరైన మరో సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే జోక్యం చేసుకుంటూ వచ్చే శుక్రవారం విచారణ చేపట్టాలని కోరారు.

అందుకు సాక్ష్యాధారాలను మేం చూపగలమని …. దీనిపై అప్లికేషన్‌ దాఖలు చేసామని ధర్మాసనానికి విన్నవించారు. మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ స్పందిస్తూ 2.7 లక్షల మంది డిపాజిటర్లకు డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించిన వివరాలను పూర్తిగా కోర్టుకు సమర్పించామని చెప్పారు. మరో సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా స్పందిస్తూ ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదన్నారు. ప్రస్తుతం ఈ కేసు పూర్తిగా భిన్న స్వరూపాన్ని సంతరించుకున్న విషయాన్ని రెండు పేజీల నోట్‌ రూపంలో సమర్పిస్తామని సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించిన జస్టిస్‌ సూర్యకాంత్‌ మార్గదర్శి సంస్థతో పాటు, ఏపీ ప్రభుత్వం, ఫిర్యాదుదారు కూడా తమ వాదనలను రెండు వారాల్లోపు నోట్‌ రూపంలో క్లుప్తంగా సమర్పించడానికి అంగీకరిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 26కి వాయిదా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.