ETV Bharat / bharat

Margadarshi Clarified there is no Rigging in Chit Auction: మార్గదర్శిపై సీఐడీ నిరాధార ఆరోపణలు.. అసలు వాస్తవాలివీ..! - Arrests of Margadarshi managers

Margadarshi Clarified there is no Rigging in Chit Auction: మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ ఈ నెల 20న నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మార్గదర్శి, బ్రాంచ్‌ మేనేజర్లపైన చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. డిఫాల్టరైన చందాదారులకు వేలంలో పాల్గొనే వీలే ఉండదని పేర్కొంది. సమావేశంలో చేసిన ప్రతి ఆరోపణకు సంబంధించిన అసలు వాస్తవాల్ని మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ వెల్లడించింది.

margadarshi_clarified_there_is_no_riggin_in_chit_auction

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 10:28 AM IST

Margadarshi Clarified there is no Rigging in Chit Auction: మార్గదర్శిపై సీఐడీ నిరాధార ఆరోపణలు.. వేలంలో రిగ్గింగ్​కు అవకాశమే లేదు

Margadarshi Chitfund Company Clarified there is no Rigging in Chit Auction: చిట్టీల వేలంలో రిగ్గింగ్‌కు అవకాశమే లేదని మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ స్పష్టం చేసింది. డిఫాల్టరైన చందాదారులకు వేలంలో పాల్గొనే వీలే ఉండదని పేర్కొంది. పూచీకత్తు సమర్పించలేక డిఫాల్ట్‌ అయితే కొత్త చిట్‌ గ్రూపులో చేరాలని చందాదారులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సూచించబోమని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్, సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దర్, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ ఈ నెల 20న నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మార్గదర్శి, బ్రాంచ్‌ మేనేజర్లపైన చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఎంపిక చేసిన కొంతమంది చందాదారుల నుంచి అసంబద్ధమైన వాంగ్మూలాలు తీసుకుని వాటి ఆధారంగా మార్గదర్శి యాజమాన్యం, బ్రాంచ్‌ మేనేజర్లపై తప్పుడు కేసులు బనాయించాలన్న ఎజెండాతోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారంది. సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు విలేకర్ల సమావేశంలో చేసిన ప్రతి ఆరోపణకు సంబంధించిన అసలు వాస్తవాల్ని మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ వెల్లడించింది.

No Scope for Rigging in Chit Auction: చిట్‌ వేలంలో రిగ్గింగ్‌కు అవకాశమే లేదు. ఏపీ చిట్‌ఫండ్‌ నియమావళి- 2008లోని రూల్‌ 17(3) ప్రకారం చందాదారు తన తరఫున వేలంలో పాల్గొనేందుకు ప్రతిసారీ ఓ ఏజెంటును నియమించుకోవచ్చు. మార్గదర్శి శాఖల్లో సంప్రదించి ఏజెంట్ల జాబితాలో నుంచి తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. చందాదారు స్వయంగా లేదా తాను ఆథరైజేషన్‌ ఇచ్చిన ఏజెంట్‌ ద్వారా వేలంలో పాల్గొనవచ్చు. చందాదారు సంతకం, తన తరఫున ఏజెంటుకు ఇచ్చిన ఆథరైజేషన్‌ పత్రాలపై ఉన్న సంతకాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫోర్‌మెన్‌ వారిని వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. చందాదారులు ఆథరైజేషన్‌ ఇవ్వలేదని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. బ్రాంచి ఫోర్‌మెన్‌ లేదా సిబ్బంది ఆ ఆధారాలన్నీ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ప్రైజ్‌ ఎమౌంట్‌ను చెల్లిస్తారు. అందువల్ల అవకతవకలకు ఆస్కారమే లేదు.

TS HC Questions to APCID in Margadarsi Case: 'కోర్టు ఆదేశాలనూ పాటించరా?'.. ఏపీ సీఐడీని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు..

False Cases Against Foremen on Baseless Evidence: డిఫాల్టరైన చందాదారులకు వేలంలో పాల్గొనే అవకాశమిస్తున్నామన్న ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాం. చందాదారు ప్రతి నెలా తన వంతు కిస్తీని చెల్లించాకే వేలంలో పాల్గొనటానికి అనుమతిస్తున్నాం. చందాదారులు కిస్తీల చెల్లింపు కోసం ఇచ్చిన చెక్కులను ఒక్కోసారి వివిధ కారణాల వల్ల బ్యాంకులు తిప్పి పంపిస్తాయి. ఆ చందాదారులు వేలంలో సక్సెస్‌ఫుల్‌ బిడ్డర్లుగా నిలిస్తే.. వారు డిఫాల్ట్‌ అయిన చందాకు సంబంధించిన మొత్తాన్ని ప్రైజ్‌మనీ నుంచి సర్దుబాటు చేసుకుని.. మిగతా మొత్తాన్ని, తగిన సెక్యూరిటీలు తీసుకుని చెల్లిస్తున్నాం. సరైన పూచీకత్తు ఇవ్వపోవటం లేదా ఇతర కారణాల వల్ల చందాదారు పాడుకున్న మొత్తం వారికి చెల్లించని పక్షంలో చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 22(2) ప్రకారం ఆ మొత్తాన్ని తదుపరి వాయిదాకు ముందే అధీకృత బ్యాంకులోని ప్రత్యేక ఖాతాలో జమ చేస్తున్నాం. ఆ వివరాలను చందాదారుకు, చిట్‌ రిజిస్ట్రార్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. దీనిపై కొంతమంది చందాదారులను బెదిరించి, వాంగ్మూలాలు తీసుకుని ఫోర్‌మెన్లపై నిరాధారమైన ఆధారాలతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.

Margadarshi Clarified there is no Rigging in Chit Auction: సరైన పూచీకత్తు ఇవ్వలేక డిఫాల్ట్‌ అయితే కొత్త చిట్‌ గ్రూపులో చేరాలని, మార్గదర్శి ఎట్టి పరిస్థితుల్లోనూ చందాదారులకు సూచించదు. చందాదారుల చెల్లింపు సామర్థ్యాన్ని మదింపు చేశాకే వారిని గ్రూపులో సభ్యులుగా చేరుస్తాం. బ్రాంచి సిబ్బంది ఎప్పటికప్పుడు చందాదారుల ఆర్థిక సామర్థ్యాన్ని క్షుణ్నంగా విశ్లేషించిన తర్వాత వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని ఒకటి కంటే ఎక్కువ చిట్లలో చేర్చుకుంటాం. ఇలా చేయడానికి చట్టంలో ఎలాంటి అవరోధం లేదు. బహుళ చిట్లున్న చందాదారుల విషయంలో బకాయిలు క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ప్రైజ్‌మనీని చెల్లిస్తాం. ఈ విషయంలోనూ పూర్తిగా చట్టానికి లోబడే వ్యవహరిస్తాం. భవిష్యత్తులో చందాదారులకు పూర్తిగా అవగాహన కల్పించి, వారి అనుమతి తీసుకున్న తర్వాతే చట్టప్రకారం బకాయిలు సర్దుబాటు చేస్తాం. అందువల్ల చందాదారులను రుణ ఉచ్చులోకి లాగుతున్నామన్న సీఐడీ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల ఆరోపణలన్నీ పూర్తిగా సంచలనం సృష్టించేందుకు చేస్తున్నవే.

Margadarsi Case Updates 'మార్గదర్శి’లో సోదాలు ఆపండి'.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ

Statement Forcefully Taken from Subscriber: చీరాల మార్గదర్శి బ్రాంచిలో బి.సుబ్రహ్మణ్యం చిట్‌ నంబరు ఎల్‌టీ39 టీసీఆర్‌-27లో చందాదారుగా చేరారు. 2021 నవంబరు వరకు 5 వాయిదాలు చెల్లించారు. ఆయన 2021 నవంబరు 28న రూ.3 లక్షలకు చిట్‌ పాడుకున్నా అవసరమైన ష్యూరిటీలు సమర్పించలేదు. ష్యూరిటీలు సమర్పించాలంటూ సుబ్రహ్మణ్యానికి మార్గదర్శి బ్రాంచి నుంచి 2021 డిసెంబరు 22న లేఖ పంపాం. తదుపరి చీటీ పాటలోపు ఆయన ష్యూరిటీలు సమర్పించకపోవడంతో.. చిట్‌ఫండ్‌ చట్టం 1982లోని సెక్షన్‌ 22(2) ప్రకారం ఆయన చీటీ పాడుకున్న మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేశాం. చిట్స్‌ రిజిస్ట్రార్‌కు ఈ విషయం లిఖితపూర్వకంగా తెలియజేశాం. దీంతోపాటు ష్యూరిటీలు సమర్పించాలంటూ చందాదారుకు పదే పదే లేఖలు పంపుతున్నాం. సుబ్రహ్మణ్యం ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్‌ అని సీఐడీ, రిజిస్ట్రేషన్‌ అధికారులు చేసిన ఆరోపణలు ఊహాజనితమైనవి. చందాదారు భార్యకు సీఐడీ అనధికారిక సిబ్బంది తప్పుడు సమాచారమిచ్చి, ఆమె నుంచి తప్పుడు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. దాని ఆధారంగా రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించారు. చందాదారు నుంచి కూడా బలవంతంగా స్టేట్‌మెంట్‌ తీసుకుని విలేకర్ల సమావేశంలో ప్రదర్శించారు.

Case Registered at Instigation of AP Govt: అనకాపల్లి మార్గదర్శి బ్రాంచిలో ఎ.వెంకటేశ్వరరావు చిట్‌ నంబరు ఎల్‌టీ44 టీఏకె-44లో రూ.5 లక్షల విలువైన చీటీ గ్రూపులో చందాదారుగా చేరారు. 2020 డిసెంబరులో ఆయన రూ.4,75,000 మొత్తానికి చీటీ పాడుకున్నారు. విశాఖపట్నం బ్రాంచిలో ఎల్‌టీ24ఎక్స్‌వి-06 చిట్‌ గ్రూపులో ఉన్న చందాదారుకు వెంకటేశ్వరరావు ష్యూరిటీ సంతకం చేశారు. ఆ చందాదారు డిఫాల్టర్‌గా ఉండటంతో వెంకటేశ్వరరావుతోపాటు ష్యూరిటీ ఇచ్చిన అందరికీ లీగల్‌ నోటీసులు జారీ చేశాం. విశాఖపట్నం కోర్టులో సూట్‌ దాఖలు చేయగా ఎ.వెంకటేశ్వరరావు రూ.3,10,807 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖ ఎన్‌ఏడీ బ్రాంచిలో మరో చందాదారుకు కూడా ఆయన ష్యూరిటీ ఇచ్చారు. ఆ చందాదారు డిఫాల్టర్‌గా ఉండటంతో వెంకటేశ్వరరావుకు 2020 డిసెంబరు 21న నోటీసులు పంపాం. వెంకటేశ్వరరావు అందుబాటులో లేరంటూ నోటీసు వెనక్కి వచ్చింది. ఈ చిట్‌ విషయంలోనూ వెంకటేశ్వరరావు రూ.1,51,182 చెల్లించాలని విశాఖ కోర్టు తేల్చి చెప్పింది. వెంకటేశ్వరరావు చీటీ పాడుకున్న మొత్తాన్ని.. 1982 చిట్‌ఫండ్‌ చట్టం సెక్షన్‌ 21(ఎఫ్‌ఏ) ప్రకారం ఆయన ష్యూరిటీ ఉన్న చందాదారులు డిఫాల్ట్‌ కావడంతో ఆ మొత్తాలకు సర్దుబాటు చేసింది. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలూ లేవు. అనకాపల్లి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ప్రభుత్వ ప్రోద్బలంతో నిరాధార ఆరోపణలతో కేసు నమోదు చేయించారు.

Telugu People With Ramoji Rao: 'తెలుగువారంతా రామోజీగారితోనే'... ట్విట్టర్​లో టాప్ ట్రెండింగ్.. ప్రభుత్వ వేధింపులపై ఆగ్రహం

Rajamahendravaram Margadarshi Branch: రాజమహేంద్రవరం మార్గదర్శి బ్రాంచిలో కె.విజయ్‌కుమార్‌ ఎల్‌టీ58టీ ఆర్‌-23 చిట్‌ గ్రూపులో చందాదారుగా చేరారు. 2020 జూన్‌ 21న రూ.3 లక్షలకు ష్యూరిటీలు సమర్పించి, చీటీ పాడుకున్నారు. చందాదారులకు ప్రైజ్‌ మనీ చెల్లించేటప్పుడు వారు మిగిలిన చందాదారులకు ఎక్కడైనా ష్యూరిటీ ఇచ్చి ఉండి, బకాయిలు ఉంటే వాటిని ఈ ప్రైజ్‌మనీలో నుంచి సర్దుబాటు చేసుకునే అధికారం చట్టప్రకారం ఉంది. కె.విజయకుమార్‌కు ష్యూరిటీలు ఇచ్చినవారు ఇతర గ్రూపుల్లో గ్యారంటీగా ఉండటంతో పాటు బకాయిపడటంతో వాటిని తిరస్కరించారు. కొత్తగా వేరే ఎవరినైనా ష్యూరిటీ తెచ్చుకోవాలని విజయ్‌కుమార్‌కు సూచించారు. చందాదారుకు ఈ విషయాన్ని పదేపదే తెలియజేస్తూనే ఆయన చీటీ పాడుకున్న మొత్తాన్ని చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారం ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేసి, చిట్‌ రిజిస్ట్రార్స్‌కు కూడా తెలియపరిచాం. విజయ్‌కుమార్‌ ఆ తర్వాత కూడా చిట్‌ వాయిదాలు చెల్లించలేదు. దీంతో ఆయన పాడుకున్న చిట్‌ మొత్తాన్ని ఆరు వాయిదాలకు ఫోర్‌మెన్‌ సర్దుబాటు చేశారు. ఏపీ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చీటీ పాడుకున్న చందాదారు చాలినంత ష్యూరిటీ సమర్పించకపోతే పాడుకున్న మొత్తాన్ని బకాయి కింద జమ చేసుకునే అధికారం ఫోర్‌మెన్‌కు ఉంటుంది. దీనిపై సీఐడీ, రిజిస్ట్రార్‌ అధికారులు చేసిన ఆరోపణలు నిరాధారం.

CID Action Against Margadarshi: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమైంది. ఘోస్ట్‌ చందాదారులున్న సందర్భాలే ఎక్కడా లేవు. శాఖల వారీగా పెద్దమొత్తంలో టికెట్లు ఉంచి.. వాటికోసం సబ్‌స్క్రైబ్‌ చేయిస్తున్నారని ఒకవైపు ఆరోపిస్తూనే, మరోవైపు ఘోస్ట్‌ చందాదారుల్ని చేర్చుకుంటున్నారంటూ పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారు. 1982 చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 22(2) ప్రకారం.. ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం వల్ల చెల్లించని ప్రైజ్‌మనీ మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేశాం. ఇలా అధీకృత బ్యాంకులో జమ చేశాక ఆ మొత్తాన్ని కంపెనీ ఉపయోగించుకోవడానికి అవకాశమే లేదు. ఈ ప్రైజ్‌మనీని ప్రత్యేక ఖాతా నుంచి చెల్లించేటప్పుడు అప్పటి వరకు బకాయిపడిన మొత్తాన్ని సర్దుబాటు చేశాకే చెల్లిస్తాం. సీఐడీ ఎస్పీ ఊహించినట్లుగా.. నిధుల నిలిపివేతకు ఆస్కారమే లేదు. అందువల్ల ఎస్పీ చేసిన ఆరోపణ పూర్తిగా సత్యదూరం. చందాదారుల నుంచి వాయిదాలు వసూలు చేసి, దాన్ని పాట పాడుకున్నవారికి సరైన పూచీకత్తులు తీసుకుని చెల్లించడం, డివిడెండ్‌ తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని వసూలు చేయాల్సిన బాధ్యతలూ చట్టప్రకారం ఫోర్‌మెన్‌పై ఉంటాయి. అందువల్ల బాధ్యత తగ్గించుకుంటున్నారనే ఆరోపణ పూర్తిగా నిరాధారం.

High Court on Margadarsi Raids: "మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయాలి".. ఏపీ హైకోర్టు సూచన

Margadarshi Company Strictly Follows the Law Rules: ఫోర్‌మెన్‌ చట్ట నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తున్నారు. గ్రూప్‌లోని చిట్‌ పాడుకోని చందాదారుల ప్రయోజనాల పరిరక్షణలో భాగంగానే బకాయిలను సర్దుబాటు చేస్తారు. పూర్తిగా చట్టానికి లోబడే నిర్వర్తించే ఈ ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారమే లేదు. సరైన పూచీకత్తులు సమర్పించని పక్షంలో, వాటిని సమర్పించే వరకు.. ప్రైజ్‌ మొత్తాన్ని (పాడుకున్న సొమ్ము) నిలిపి ఉంచే హక్కు ఫోర్‌మెన్‌కు ఉందని ఎఫ్‌ఏ618 ఆఫ్‌ 2014, ఎఫ్‌ఏ 302 ఆఫ్‌ 2018 కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ ఉత్తర్వులు ఇచ్చింది. చిట్‌ ఒప్పందంలోని క్లాజ్‌ 7 ప్రకారం.. పాట పాడుకున్న మొత్తాన్ని తీసుకునేందుకు అవసరమైన హామీలు సమర్పించే విధివిధానాల్ని చందాదారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. హామీలను అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అనే విచక్షణాధికారం ఉప క్లాజ్‌ 3 ప్రకారం ఫోర్‌మెన్‌కు ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.