ETV Bharat / bharat

మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం ఓకే, శాంతియుతంగా ఉండాలని అఖిలపక్షం పిలుపు - మరాఠా రిజర్వేషన్​ ఆందోళనలు

Maratha Reservation All Party Meeting : మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుకూలమేనని ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వెల్లడించారు. ముంబయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయమై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని వివరించారు.

Maratha Reservation All Party Meeting
Maratha Reservation All Party Meeting
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 6:20 PM IST

Updated : Nov 1, 2023, 7:11 PM IST

Maratha Reservation All Party Meeting : మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వెల్లడించారు. ముంబయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయమై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని వివరించారు. మరాఠాలకు రిజర్వేషన్లు.. చట్టప్రకారం జరగాలని ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరగకుండా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజలంతా శాంతియుతంగా మెలగాలని.. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలు, శాంతియుత ఆందోళనలకు చెడ్డపేరు తెస్తున్నాయన్న ఆయన.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. సామాన్యులు అభద్రతాభావం కలిగేలా వ్యవహరించవద్దని నిరసనకారులకు సూచించారు.

Maratha Reservation All Party Meeting
అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు

Maratha Reservation Issue : ఈ సందర్భంగా కోటా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త మనోజ్‌ జరంగే పాటిల్‌ తన దీక్షను విరమించాలని నేతలు ఓ తీర్మానం చేశారు. దానిపై సీఎం ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్​సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్‌ ఠాక్రే తరఫున హాజరైన అనిల్‌ పరాబ్‌లు సంతకాలు పెట్టారు. చట్టపరంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంచెం సమయం కావాలని, అంతవరకు మరాఠా సామాజికవర్గం నేతలు సంయమనం పాటించాలని శిందే కోరారు. ఈ విషయంపై జరంగే కూడా ప్రభుత్వానికి సహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఎన్​సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో పాటు.. ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. కానీ, మరాఠా రిజర్వేషన్ల ఆవశ్యకత దృష్ట్యా తమ ఎమ్మెల్యేలు వెళ్లినట్లు ఆ వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు.

Maratha Reservation All Party Meeting
అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు
Maratha Reservation All Party Meeting
అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు

అంతకముందు మీడియాతో మాట్లాడిన మరాఠా ఉద్యమనేత జరంగే.. తమకు ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం కుంబీ కులంలో చేర్చితే సరిపోతుందని చెప్పారు. మరాఠాలు కుంబీ కులానికి చెందిన వారని.. ఆ కులం ఓబీసీ కేటగిరీ కిందకి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరాఠా సామాజిక వర్గ ప్రజలకు అధికారులు కొత్తగా కుంబీ కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారు ఓబీసీ ప్రయోజనాలు పొందే అవకాశం లభించినట్లయింది.

  • VIDEO | Jarange said that the Maratha community will not accept an "incomplete reservation" and the Maharashtra government should call a special session of the state legislature on the issue.

    He threatened to stop drinking water from today evening if the "complete" quota was not… pic.twitter.com/VFWz54aabm

    — Press Trust of India (@PTI_News) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Maratha Quota Stir : మరోవైపు మరాఠా కోటా ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాలు సహా మున్సిపల్​ భవనానికి నిప్పంటించిన నేపథ్యంలో బీడ్‌లో కర్ఫ్యూ విధించారు. ఇప్పటి వరకు 141 కేసులు నమోదు చేశామని.. 168 మందిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ రజనీశ్ సేథ్ తెలిపారు. సుమారు రూ.12కోట్ల ఆస్తులు ధ్వంసం చేసినట్లు వివరించారు. బీడ్​ జిల్లాలో జరిగిన ఘటనలపై 20 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు.

Maratha Reservation All Party Meeting
అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు

Maratha Reservation Agitation : రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్యే ఇంటికి నిప్పు- సీఎం వార్నింగ్!

Maratha Reservation Agitation : ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయానికి నిప్పు.. మరాఠా కోటా నిరసనలు ఉద్ధృతం

Last Updated : Nov 1, 2023, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.