ETV Bharat / bharat

Maratha Reservation Agitation : రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్యే ఇంటికి నిప్పు- సీఎం వార్నింగ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 1:43 PM IST

Updated : Oct 30, 2023, 4:35 PM IST

Maratha Reservation Agitation : మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్​లకు అనకూలంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులు బీడ్‌ జిల్లాలోని ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే నివాసానికి నిప్పు పెట్టారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Maratha Reservation Agitation
Maratha Reservation Agitation

Maratha Reservation Agitation : మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లకు అనుకూలంగా జరుగుతున్న నిరసనలు హింసాయుతంగా మారాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం బీడ్‌ జిల్లా మజాల్‌గావ్​లోని ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే నివాసానికి నిప్పు పెట్టారు. అంతకుముందు గుంపులుగా తరలివచ్చిన నిరసనకారులు ఎమ్మెల్యే ఇంటిపైకి రాళ్లు విసిరారు. అక్కడే బయట పార్క్​ చేసి ఉన్న కార్లకు నిప్పంటించారు.

ఇటీవలే ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే మరాఠా రిజర్వేషన్​ల కోసం ఆందోళనలపై, మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్​పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్​గా మారింది. అక్టోబర్​ 24 నాటికి మరాఠా కోటా అమలు చేయాలంటూ ప్రభుత్వానికి 40 రోజులు గడువు ఇవ్వడం ఓ పిల్లల ఆటగా మారిందని సోలంకే మాట్లాడినట్లు ఆడియో క్లిప్​లో ఉందని సమాచారం. దీంతో ఆగ్రహించిన మరాఠీలు స్థానికంగా బంద్​కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ప్రకాశ్​ సోలంకే ఇంటిపైకి దాడికి దిగారు.

  • VIDEO | Protesters demanding reservation for Maratha community pelted stones at the house of sitting MLA Prakash Solanke of Ajit Pawar camp in Majalgain in Maharashtra's Beed district earlier today. pic.twitter.com/zMjqna3Ath

    — Press Trust of India (@PTI_News) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తన ఇంటిపై దాడితో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 'మరాఠా రిజర్వేషన్​ కోసం ఆందోళన చేస్తున్న నిరసనకారులు బీడ్‌లోని మా ఇంటిపై దాడికి దిగి నిప్పంటించారు. ఆ సమయంలో నేను, నా కుటుంబ సభ్యులు, సిబ్బంది ఇంట్లోనే ఉన్నాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది' అని ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే ట్వీట్​ చేశారు.

  • Mumbai | On the attack on NCP MLA Prakash Solanke's Beed residence by pro-Maratha reservation protestors, CM Eknath Shinde says, "Manoj Jarange Patil (Maratha reservation activist) should take note of the fact what turn this protest is taking. It is going in the wrong direction." pic.twitter.com/SlC9bDiXxv

    — ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం రియాక్షన్​..
ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే నివాసంపై మరాఠా రిజర్వేషన్ అనుకూల నిరసనకారులు దాడి చేయడంపై స్పందించారు మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ శిందే. 'ఈ ఆందోళనలు ఏ మలుపు తిరుగుతాయో, ఎక్కడికి దారితీస్తాయో మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ గమనించాలి. మీరు చేసే నిరసనలు తప్పు దిశగా సాగుతున్నాయి.' అని శిందే ట్విట్టర్​ వేదికగా సూచించారు.

'ట్రిపుల్​ ఇంజిన్​ సర్కార్​దే బాధ్యత..'
మరాఠా రిజర్వేషన్ల నిరసనలపై స్పందించిన ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలే.. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర హోం మంత్రి, హోం మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 'మహారాష్ట్రలోని ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మరాఠా, ధన్‌గర్, లింగాయత్, ముస్లిం వర్గాలను బీజేపీ మోసం చేస్తోంది' అని సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.

  • Delhi: On the Maratha reservation, NCP MP Supriya Sule says, "Maharashtra's triple-engine government is responsible for whatever situation is there today. The BJP is deceiving the Maratha, Dhangar, Lingayat, and Muslim communities." pic.twitter.com/M7ByBNGpPE

Death of Former BJP MPs Son : వైద్యుల నిర్లక్ష్యంతో బీజేపీ మాజీ ఎంపీ కొడుకు మృతి!.. ICU బెడ్లు లేక గంటపాటు అవస్థ

Kerala Blast Bomb : 'యూట్యూబ్​ చూసి బాంబుల తయారీ.. సాక్ష్యం కోసం స్వయంగా వీడియోగ్రఫీ'.. కేరళ బ్లాస్ట్ కేసులో షాకింగ్ నిజాలు

Last Updated : Oct 30, 2023, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.