ETV Bharat / bharat

చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకలు - కర్ణాటక న్యూస్

Karnataka Maramma: కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో మారమ్మ భక్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. అమ్మవారికి కానుకగా పాత చీరలు, గాజులు, నిరుపయోగ వస్తువులు సమర్పిస్తున్నారు. ఇలా చేస్తే తమ కోరికలు తీరతాయని విశ్వసిస్తున్నారు. ఇందుకోసం ఏటా ఘనంగా ఉత్సవం నిర్వహిస్తున్నారు.

Maramma relieving all hardship
చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకలు
author img

By

Published : Apr 2, 2022, 4:16 PM IST

Updated : Apr 2, 2022, 7:40 PM IST

చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకలు

Karnataka Maramma Temple: అమ్మవారిని ఎవరైనా సాధారణంగా పూలతో అలంకరిస్తారు. పండ్లు, పిండివంటలు నైవేద్యంగా ఇస్తారు. నగదు, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కానుకలుగా సమర్పిస్తుంటారు. కానీ కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా కార్​వారలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. అక్కడ మారమ్మ ఆలయంలో దేవతకు నిరుపయోగ, వాడి పడేసిన వస్తువులను సమర్పిస్తున్నారు భక్తులు. ఇంట్లో పనికిరాని వస్తువులు, పాత బట్టలు, చెత్తను కానుకలుగా ఇస్తున్నారు.

maramma-relieving-all-hardship
చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకలు

Maramma goddess Karnataka: దక్షిణ భారత దేశంలోని శక్తి పీఠాల్లో శిరాజి శ్రీ మారికాంబ దేవి పీఠం కూడా ఒకటి. ఇక్కడ దేవతకు పాత వస్తువులను కానుకగా ఇస్తే కోరిన కోరికలు తీరతాయని ప్రజలు విశ్వసిస్తారు. ఏటా గడి మారి, సీమె మారి పేరుతో ఉత్సవం నిర్వహించి తమ ఇళ్లలోని పాత వస్తువులు, గాజులు, పాత బట్టలు, ఆట వస్తువులను కానుకలుగా సమర్పిస్తుంటారు. దీన్ని మారి హోరె అని పిలుస్తుంటారు.

maramma-relieving-all-hardship
చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకలు

ఈ జాతర సమయంలో అందరూ తమ ఇంటి నుంచి ఏదో ఒక మొక్కు సమర్పించుకుంటారు. ఎక్కువగా చీరలు, గాజులు సమర్పిస్తారు. దీనితో పాటు ఉప్పును కూడా ఎక్కువ ఇస్తుంటారు. చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు ఉంటే నివారణ అవుతాయని స్థానికుల నమ్మకం.

- స్థానికుడు

Mari Hore: ఏటా మారి హోరె శిరాజిలో ప్రారంభమవుతుంది. ఒక గ్రామం నుంచి మరో గ్రామం తిరుగుతూ వెళ్తుంది. 18 గ్రామాలకు చెందిన పలు సామాజిక వర్గాలు మారి హోరెలో పాల్గొంటాయి. కార్​వార గీతాంజలి థియేటర్ సమీపంలోని మారమ్మ ఆలయం వద్ద వీటిని సమర్పిస్తుంటారు.

maramma-relieving-all-hardship
చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకలు
maramma-relieving-all-hardship
చెత్త, పాత బట్టలే ఈ అమ్మవారికి కానుకలు

ఇదీ చదవండి: బుల్లెట్​ ర్యాలీతో అదరగొట్టిన మహిళలు.. కలర్​ఫుల్​ చీరకట్టుతో నృత్యాలు

Last Updated : Apr 2, 2022, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.