Margadarshi Chit Case: ఆంధ్రప్రదేశ్‌లో చిట్ గ్రూప్‌ల నిలిపివేతకు సంబంధించి.. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మధ్యంతర ఉత్తర్వులపై న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చిట్స్ రిజిస్ట్రార్ లేదా డిప్యూటీ రిజిస్ట్రార్.. జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసును సవాలు చేస్తూ.. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో.. వాదనలు జరిగాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల చిట్ గ్రూపుల విషయమై దాఖలైన రెండు వ్యాజ్యాల్లో అనుబంధ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారంపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు.. న్యాయమూర్తి ప్రకటించారు.
Maragadarshi Chit Case: మార్గదర్శి వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా..
ప్రకాశం జిల్లా చిట్ గ్రూపులపై దాఖలైన మరో వ్యాజ్యంపై.. విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌లో తగిన ఉత్తర్వులు ఇస్తామని.. మౌఖికంగా పేర్కొన్నారు. బుధవారం జరిగిన విచారణలో.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చిట్ గ్రూపుల నిలిపివేతకు.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. ఉల్లంఘనలు కొనసాగుతున్నందున.. అభ్యంతరాలను ఆహ్వానిస్తూ బహిరంగ నోటీసిచ్చామన్నారు.
సుమోటోగా చర్యలు ప్రారంభించే అధికారం చిట్ రిజిస్ట్రార్లకు ఉందని తెలిపారు. ఫిర్యాదు కోసం.. వేచి చూడాల్సిన అవసరం లేదని, 2008లో జారీ చేసిన జీవో ప్రకారం.. అసిస్టెంట్, డిప్యూటీ రిజిస్ట్రార్లకు అధికారాలను కేటాయించారని తెలిపారు. ప్రకాశం జిల్లా పిటిషన్ విషయంలో.. చిట్ గ్రూపుల నిలుపుదలకు ముందుగా ఉత్తర్వులిచ్చి, తర్వాత అభ్యంతరాలను ఆహ్వానిస్తూ నోటీసిచ్చిన నేపథ్యంలో వాటిని ఉపసంహరించుకొంటామని చెప్పారు.
Margadarshi: ఈనాడుపై కక్షతోనే మార్గదర్శి సంస్థపై సీఐడీ ఏఫ్ఐఆర్లు
న్యాయస్థానం.. ఆ నోటీసుల అమలుపై.. స్టే ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. మరోవైపు ఆరోపణలే లేనప్పుడు సుమోటోగా సైతం చర్యలు ప్రారంభించలేరని.. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌లు.. ఎవరికివారు వేర్వేరుగా చట్టబద్ధమైన విధులు నిర్వర్తించాలన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ తనిఖీలు చేసి, డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్ గ్రూపుల నిలుపుదలపై అభ్యంతరాలను ఆహ్వానించడం చెల్లదన్నారు.
అధికారుల చర్య.. ఓ న్యాయమూర్తి వాదనలు విని.. మరో న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లుందని అన్నారు. సొమ్ము చెల్లించడం లేదనే ఆరోపణ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై లేదన్నారు. అలాంటప్పుడు.. చిట్ గ్రూపుల నిలుపుదలకు.. సుమోటోగా సైతం చర్యలు చేపట్టలేరన్నారు. అభ్యంతరాలను తెలపడానికి ఇచ్చిన గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇచ్చిన బహిరంగ నోటీసు అమలును నిలిపివేయాలని కోరారు. ఆ నోటీసు ఆధారంగా.. తదుపరి చర్యలు తీసుకోకుండా.. అధికారులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. అనంతరం న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
Margadarsi Case: 'మార్గదర్శి మూసివేతకు ఏపీ ప్రభుత్వ కుట్ర.. చట్టనిబంధనల ముసుగులో కక్షసాధింపు'