దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.(Schools Reopen) 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు మాస్క్‌లు ధరించి పాఠశాలలకు హాజరయ్యారు. 50 శాతం సామర్థ్యంతో విద్యాసంస్థలు పునఃప్రారంభించారు. స్క్రీనింగ్ చేసిన తర్వాతే విద్యార్థులను బడుల్లోకి(Covid rules in schools) అనుమతించారు. హస్తినలో 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వారం రోజుల తర్వాత బడులు తెరవనున్నారు. అన్ని పాఠశాలల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు, రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని కేజ్రీవాల్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
యూపీలో 1 నుంచి ఐదో తరగతి..
ఉత్తరప్రదేశ్‌లో(Schools reopening in up) ఇప్పటికే 9 నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు తరగతులు జరుగుతుండగా.. బుధవారం నుంచి 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులనూ అనుమతించారు. యూపీలో సెప్టెంబర్ 23 నుంచి 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.
మధ్యప్రదేశ్‌లో.. బుధవారం నుంచి 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే అక్కడ ప్రత్యక్ష బోధన(Direct classes) కొనసాగుతోంది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకురావడం తప్పనిసరి చేశారు.
కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా..
రాజస్థాన్ ప్రభుత్వం 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను తిరిగి ప్రారంభించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు , కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు కూడా తెరిచారు. 50 శాతం మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ స్పష్టం చేసింది.
తమిళనాడులోనూ 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు బడులకు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించారు.
హరియాణాలో 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరిచారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకురావడం తప్పనిసరి చేశారు. పుదుచ్చేరిలో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు.. తరగతులను 50 శాతం సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: breakthrough infection: 'టీకా తీసుకున్న 25శాతం ఆరోగ్య సిబ్బందికి కరోనా'