ETV Bharat / bharat

అంబానీ ఇంటి వద్ద బాంబుల కేసులో మరో ట్విస్ట్ - mansukh hiren death

ముంబయిలో మన్​సుఖ్ హిరేన్​ మృతిపై దర్యాప్తు నిర్వహిస్తున్న మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్​).. మన్​సుఖ్​ది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. వసాయ్​ సమీపంలోని తుంగరేశ్వర్​ వద్ద మన్​సుఖ్​ రెండో ఫోన్​ను కనుగొన్నారు అధికారులు. దీంతో మన్​సుఖ్​ను చంపిన హంతకులు.. మృతదేహాన్ని వసాయ్​ తీసుకెళ్లి.. మళ్లీ ఠాణెకు తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

Mansukh Hiren UPDATE  - Shocking revelation in ATS investigation - Preliminary it seems that Mansukh Hiren was killed
మన్​సుఖ్​ది హత్యే: ఏటీఎస్​ ప్రాథమిక దర్యాప్తు
author img

By

Published : Mar 9, 2021, 2:06 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో ఇటీవల కలకలం రేపిన పేలుడు పదార్థాల వాహనం యజమానిగా భావిస్తున్న హిరేన్‌ మన్‌సుఖ్‌ మృతిపై విస్తుపోయే నిజాలను బయటపెట్టింది మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్​). మన్​సుఖ్​ది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది.

వసాయ్​లోని మాండ్వీలో మన్​సుఖ్ మొదటి ఫోన్ లభ్యం కాగా.. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో తుంగరేశ్వర్​ వద్ద మన్​సుఖ్​ రెండో ఫోన్​ను కనుగొన్నారు అధికారులు. దీంతో మన్​సుఖ్​ను చంపిన హంతకులు.. మృతదేహాన్ని వసాయ్​ తీసుకెళ్లి.. మళ్లీ ఠాణెకు తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. మన్​సుఖ్ చంపి.. నీటిలో వేసినట్లు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ప్రస్తుతం అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల ఘటనకు సంబంధించి పోలీస్​ అధికారి సచిన్​ వేజ్ దర్యాప్తు చేస్తున్నారు.

దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసానికి సమీపంలో ఇటీవల జిలెటిన్‌ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. అనంతరం ఆ వాహనం తనదేనని, వారం రోజుల క్రితం అది చోరీకి గురైందని మన్‌సుఖ్‌ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో గురువారం అదృశ్యమైన ఆయన శుక్రవారం సముద్రపు పాయలో శవమై కనిపించారు.

ఇదీ చదవండి : హిరేన్‌ మృతి... హత్యా? ప్రమాదమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.