Manmohan Singh Health: మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్లమెంటు శీతాకాల సమావేశాలకు గైర్హాజరయ్యేందుకు అనుమతించారు. సెలవులకు సంబంధించిన దరఖాస్తు ఛైర్మన్ టేబుల్ వద్దకు వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేశారు వెంకయ్య.
" డాక్టర్ మన్మోహన్ సింగ్ నుంచి లేఖ అందింది. అనారోగ్య కారణాలతో శీతాకాల సమావేశాలకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. అందుకు అనుమతిస్తున్నాం. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరుగుతున్న మొత్తం శీతాకాల సమావేశాలకు సెలవులు మంజూరు చేస్తున్నాం. "
- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్.
89 ఏళ్ల మన్మోహన్ సింగ్‌కు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. గుండె సంబంధింత సమస్యలతో గత అక్టోబర్‌లో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు సింగ్. అంతకుముందు పలుమార్లు బైపాస్ సర్జరీలు జరిగాయి.
ఇదీ చూడండి: ఎంపీల సస్పెన్షన్‌పై వెంకయ్య కీలక వ్యాఖ్యలు