ETV Bharat / bharat

లిక్కర్ కేస్​లో సీబీఐ ట్విస్ట్.. మరో 14 రోజులు జైలులోనే మనీశ్ సిసోదియా - delhi liquor scam

మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోదియాకు.. మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో మరో రెండు వారాల పాటు ఆయన జైలులోనే ఉండనున్నారు. సోమవారం రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

manish-sisodia-to-judicial-custody-till-march-20
మనీష్ సిసోదియా
author img

By

Published : Mar 6, 2023, 2:30 PM IST

Updated : Mar 6, 2023, 3:36 PM IST

దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశే సిసోదియా మరో రెండు వారాల పాటు జైలులో ఉండనున్నారు. ఆయనకు మార్చి 20 వరకు జ్యుడీషియల్​​ కస్టడీ విధించింది కోర్టు. సోమవారం.. దిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన సిసోదియా.. గత వారం రోజులుగా సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. సోమవారం ఆయన కస్టడీ ముగిసింది. దీంతో మధ్యాహ్నం ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట సిసోదియాను.. సీబీఐ అధికారులు హాజరు పరిచారు.

సిసోదియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు నివేదించారు. ఆయన అనేక విషయాలు దాచిపెడుతున్నారని తెలిపారు. ఆప్ మద్దతుదారులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. ప్రస్తుతానికి సిసోదియా కస్టడీ తమకు అవసరం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తరువాత అవసరం కావచ్చని పేర్కొన్నారు. దీనిపై ఇరువురి పక్షాల వాదనలు విన్న కోర్టు.. సిసోదియాకు రెండు వారాలు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. జైలులో మనీశ్ సిసోదియాకు ఓ డైరీ, పెన్, భగవద్గీతను తీసుకువెళ్లేందుకు అనుమతి కావాలని.. ఆయన న్యాయవాది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును కోరారు. ఇందుకు కోర్టు సమ్మతించింది. వాటిని తీసుకువెళ్లేందుకు సిసోదియాకు అనుమతించాలని తీహాడ్ జైలు అధికారులను ఆదేశించింది.

ఫిబ్రవరి 26న సిసోదియా అరెస్ట్
ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం 27న కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో సిసోదియాను తమ కస్టడీలోకి సీబీఐ అధికారులు తీసుకున్నారు. తొలుత ఐదు రోజులకు విచారణకు అనుమతించిన కోర్టు.. ఆ తర్వాత మరో రెండు రోజులు పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల నేపథ్యంలో.. ఫిబ్రవరి 28న మనీశ్ సిసోదియా మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇదీ కేసు..
దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో.. మద్యం తయారీ దారులు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు లబ్ది చేకూరే విధంగా వ్యవహరించారనే ఆరోపణలతో మనీశ్​ సిసోదియా అరెస్టు చేశారు. మద్యం విధానం రూపొందించే సమయంలో.. మద్యం తయారీదారులు, వ్యాపారులు తమకు అనుకూలంగా ఉండే అంశాలను చేర్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం విధానం అధికారికంగా విడుదల చేయకముందే.. సంబంధిత డాక్యుమెంట్ మద్యం వ్యాపారుల వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షమైందని సీబీఐ ఆరోపించింది. దీంతో పాటు.. వ్యాపారులు, తయారీదారులు, ప్రభుత్వ పెద్దలు మధ్య జరిగిన చర్చల ఆధారాలు ధ్వంసం చేశారని సీబీఐ పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా.. గత ఆదివారం 8 గంటలకు విచారణ తర్వాత​ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది.

Last Updated : Mar 6, 2023, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.