ETV Bharat / bharat

రెచ్చిపోయిన అల్లరి మూకలు.. ఆయుధాల లూటీకి యత్నం.. మణిపుర్​లో హింస - manipur school reopen

Manipur violence : మణిపుర్​లో అల్లరి మూకలు ఆయుధాల లూటీకి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. అల్లరి మూకలను భద్రతా బలగాలు సమర్థంగా అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

Manipur violence
Manipur violence
author img

By

Published : Jul 5, 2023, 11:05 AM IST

Updated : Jul 5, 2023, 12:44 PM IST

Manipur violence : హింసాత్మక ఘటనలతో అల్లాడుతున్న మణిపుర్​లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్​బీ)​ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు యత్నించాయి. అయితే, ఈ ప్రయత్నాన్ని భద్రతా దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ధౌబాల్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ఐఆర్​బీ అధికారి ఇంటికి నిప్పు పెట్టారు.

అల్లరి మూకలు వందల సంఖ్యలో వచ్చి ఐఆర్​బీ బెటాలియన్ పోస్ట్​పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్​తోనే ఇదంతా చేసినట్లు స్పష్టమవుతోంది. ఐఆర్​బీ దళాలకు మద్దతుగా సైన్యం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇతర భద్రతా దళాలు రాకుండా రోడ్లను ముందుగానే తవ్వేశాయి. అయితే, అసోం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు మాత్రం ఘటనాస్థలికి చేరుకోగలిగాయి. దీంతో ముప్పు తప్పినట్లైంది. భద్రతా బలగాలు మూకుమ్మడిగా అల్లరిమూకలను చెదరగొట్టాయి. ఈ క్రమంలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.

  • 𝗔𝘁𝘁𝗲𝗺𝗽𝘁 𝘁𝗼 𝗟𝗼𝗼𝘁 𝗪𝗽𝗻𝘀 𝗳𝗿𝗼𝗺 𝗜𝗥𝗕 𝗮𝘁 𝗞𝗵𝗮𝗻𝗴𝗮𝗯𝗼𝗸,𝗧𝗵𝗼𝘂𝗯𝗮𝗹 𝗗𝗶𝘀𝘁𝘁
    An attempt to loot weapons from an India Reserve Battalion at Khangabok in Thoubal district of #Manipur was successfully thwarted by Security Forces today. One rioter was… pic.twitter.com/K6QxCVMMU5

    — SpearCorps.IndianArmy (@Spearcorps) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొనసాగుతున్న కాల్పులు
మరోవైపు, మణిపుర్‌లో హింస కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం. అంతకుముందు మంగళవారం రాత్రి ఖోయిజుంతాబి ప్రాంతంలో కాల్పులు జరగగా.. మరో ఘటన బుధవారం తెల్లవారు జామున 4.30 సమయంలో తూర్పు ఫైలెంగ్‌ ప్రాంతంలో జరిగింది. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం లేదు.

రెండు నెలల తర్వాత తెరుచుకున్న స్కూళ్లు
Manipur School Reopen : హింసాత్మక ఘటనలు జరగుతున్న మణిపుర్‌లో దాదాపు రెండు నెలల విరామం తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కానీ విద్యార్థుల హాజరు మాత్రం తక్కువగా ఉంది. మే నెల ఆరంభంలో రెండు వర్గాల మధ్య మణిపుర్‌లో మొదలైన హింసాత్మక ఘటనలతో మణిపుర్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి పాఠశాలలు తెరుచుకుకోలేదు. ఘర్షణలు ఇంకా అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలు జులై 5 నుంచి తెరుచుకుంటాయని మణిపుర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ సోమవారమే ప్రకటించారు. పాఠశాలలు తిరిగి తెరవాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతించారు. రెండు నెలలు ఇంటికే పరిమితమైన విద్యార్థులు పాఠశాలలకు చేరుకుని తమ స్నేహితులను కలుసుకున్నారు.

  • #WATCH | Manipur | A few schools in the state, including Little Flower School in Imphal and The Regular English High School in Kwakeithel, reopened today.

    A few other schools have been exempted from reopening as they are presently involved in providing relief measures. pic.twitter.com/oLAXRkJsWL

    — ANI (@ANI) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి : మణిపుర్​లో ఆగని హింస.. గుంపులుగా వచ్చి దాడులు.. బీజేపీ ఆఫీస్​ ధ్వంసం!

Manipur Violence : కేంద్ర సహాయ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు.. ఇళ్లంతా ధ్వంసం!

Last Updated : Jul 5, 2023, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.