Manipur Violence Army : మణిపుర్‌లో హింసకు పాల్పడుతున్న 12 మంది మైతై మిలిటెంట్లను అరెస్టు చేసిన భారత సైన్యం.. స్థానికంగా మహిళల తిరుగుబాటు చెలరేగడం వల్ల వారందరినీ విడుదల చేసింది. కఠిన చర్యలు తీసుకుంటే స్థానికుల ప్రాణాలకు ప్రమాదమని భావించిన సైన్యం.. వారిని విడిచిపెట్టింది.
అసలేం జరిగిందంటే?
Manipur Women : ఇంఫాల్ తూర్పు జిల్లాలో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా ఆపరేషన్ చేపట్టాయి. హింసను ప్రేరేపిస్తున్న 12 మంది కంగ్లీ యావోల్ కన్న లుప్ తీవ్రవాద ముఠా సభ్యులను ఇతాం గ్రామంలో భద్రతాదళాలు అరెస్టు చేశాయి. 2015లో '6 డోగ్రా యూనిట్'పై ఆకస్మిక దాడితో సహా అనేక ఘటనల్లో ఈ బృందం హస్తం ఉందని ఆర్మీ తెలిపింది. దీంతోపాటు పెద్దఎత్తున ఆయుధాలనూ స్వాధీనం చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆ సంస్థ సానుభూతిపరులు.. దాదాపు 1200 నుంచి 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు.
-
𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗶𝗻 𝗜𝘁𝗵𝗮𝗺 𝗩𝗶𝗹𝗹𝗮𝗴𝗲 𝗶𝗻 𝗜𝗺𝗽𝗵𝗮𝗹 𝗘𝗮𝘀𝘁 𝗗𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Acting on specific intelligence, operation was launched in Village Itham (06 km East of Andro) in Imphal East by Security Forces today morning. Specific search after laying cordon was… pic.twitter.com/7ZH9Jp8nOI
">𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗶𝗻 𝗜𝘁𝗵𝗮𝗺 𝗩𝗶𝗹𝗹𝗮𝗴𝗲 𝗶𝗻 𝗜𝗺𝗽𝗵𝗮𝗹 𝗘𝗮𝘀𝘁 𝗗𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 24, 2023
Acting on specific intelligence, operation was launched in Village Itham (06 km East of Andro) in Imphal East by Security Forces today morning. Specific search after laying cordon was… pic.twitter.com/7ZH9Jp8nOI𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗶𝗻 𝗜𝘁𝗵𝗮𝗺 𝗩𝗶𝗹𝗹𝗮𝗴𝗲 𝗶𝗻 𝗜𝗺𝗽𝗵𝗮𝗹 𝗘𝗮𝘀𝘁 𝗗𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 24, 2023
Acting on specific intelligence, operation was launched in Village Itham (06 km East of Andro) in Imphal East by Security Forces today morning. Specific search after laying cordon was… pic.twitter.com/7ZH9Jp8nOI
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరినా.. ఫలితం లేకపోయింది. ఇలా ఇరువర్గాల మధ్య రోజంతా ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు సైన్యం వారిని విడిచిపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న సున్నిత పరిస్థితుల నేపథ్యంలో.. ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ తెలిపింది. అయితే, స్వాధీనం చేసుకున్న ఆయుధాలను తరలించినట్లు పేర్కొంది.
-
#WATCH | Manipur: Security forces launched an operation acting on specific intelligence, in village Itham in Imphal East district on 24th June. The operation resulted in apprehension of 12 KYKL cadres along with arms, ammunition and war-like stores. Self-Styled Lt Col Moirangthem… pic.twitter.com/B1yXoJ9WKo
— ANI (@ANI) June 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Manipur: Security forces launched an operation acting on specific intelligence, in village Itham in Imphal East district on 24th June. The operation resulted in apprehension of 12 KYKL cadres along with arms, ammunition and war-like stores. Self-Styled Lt Col Moirangthem… pic.twitter.com/B1yXoJ9WKo
— ANI (@ANI) June 25, 2023#WATCH | Manipur: Security forces launched an operation acting on specific intelligence, in village Itham in Imphal East district on 24th June. The operation resulted in apprehension of 12 KYKL cadres along with arms, ammunition and war-like stores. Self-Styled Lt Col Moirangthem… pic.twitter.com/B1yXoJ9WKo
— ANI (@ANI) June 25, 2023
మణిపుర్‌లో శాంతిని నెలకొల్పుతాం: అమిత్ షా
మరోవైపు, దిల్లీలో మణిపుర్ పరిస్థితులపై శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా.. త్వరలోనే ఆ రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయని హామీ ఇచ్చారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి హాజరైన 18 పార్టీల అభిప్రాయాలన్నింటినీ విన్న తర్వాత అమిత్ షా.. పలు అంశాలపై మాట్లాడారు.
"మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణ కోసం అన్ని పార్టీలూ రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలందించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను పెద్ద మనసుతో పరిశీలిస్తుంది. ప్రధాని మోదీ మొదటి రోజు నుంచీ మణిపుర్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సమస్యకు పరిష్కారం కనుగొనడానికి పూర్తి సున్నితత్వంతో మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అందరినీ భాగస్వాములను చేసి సమస్యకు పరిష్కారం కనుగొనాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. అక్కడ నెమ్మదిగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి"
-- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
"ఈ నెల 13 అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకూ ఒక్కరూ చనిపోలేదు. చోరీకి గురైన 1800 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. 36,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించాం. 40 మంది ఐపీఎస్ అధికారులు, 20 వైద్య బృందాలను మణిపుర్‌కు పంపాం. సమస్య పరిష్కారానికి సూచనలందించినందుకు అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని అమిత్‌షా వ్యాఖ్యానించారు.
మణిపుర్ సీఎంను తొలగించాల్సిందే!
సుమారు 4 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్షాన్ని మణిపుర్ తీసుకెళ్లాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు కోరాయి. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తొలగించాలని మరికొన్ని పార్టీలు డిమాండు చేశాయి. సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, ఆమ్ ఆద్మీ, భారాస, వైకాపా, లెఫ్ట్ సహా 18 పార్టీలు పాల్గొన్నాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు.