Manipur poll dates revised: మణిపుర్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27న తొలి దశ, మార్చి 3న రెండో దశ ఓటింగ్ జరుగుతుందని తొలుత ప్రకటించిన ఈసీ.. ఇప్పుడు ఆ తేదీల్లో ఈమేరకు మార్పులు చేసింది. ఎన్నికల ఫలితం మాత్రం మార్చి 10నే వెలువడుతుందని స్పష్టం చేసింది.
పంజాబ్ ఎన్నికల తేదీ మార్పు
ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో యూపీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ తొలుత ప్రకటించింది. ఫిబ్రవరి 14న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో పోలింగ్ ఉంటుందని తెలిపింది.
అయితే.. ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లగా... ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఫిబ్రవరి 14కు బదులు 20న ఓటింగ్ నిర్వహిస్తామని కొద్దిరోజుల క్రితం స్పష్టం చేసింది. ఇప్పుడు మణిపుర్ ఎన్నికల తేదీల్లోనూ మార్పులు చేసింది.
ఇదీ చదవండి: యూపీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతం.. 57.79% పోలింగ్