ETV Bharat / bharat

గల్వాన్​​ యోధుడిని సత్కరించిన సీఎం

మొక్కవోని ధైర్యంతో చైనా సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేసిన మణిపుర్​ యువ సైనికుడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్​. బీరెన్ సింగ్ సత్కరించారు. ఇలాంటి సైనికులకు దేశం ఎప్పుడూ రుణ పడి ఉంటుందని కొనియాడారు.

Manipur CM felicitates captain Rangnamei
మణిపూర్​ యోధుడిని సత్కరించిన సీఎం
author img

By

Published : Feb 23, 2021, 7:23 PM IST

గల్వాన్​ లోయను ఆక్రమించిన చైనా దళాలను నిలువరించే భారత సైనిక బృందాన్ని ముందుండి నడిపిన యువసైనికాధికారి కెప్టెన్ సోయిబా మనిగబ్బా రంగ్నామీని సత్కరించారు మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్​.బీరెన్ సింగ్. మంగళవారం సీఎం నివాసం వద్ద యువ సైనికుడిని సత్కరించినట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

"మణిపుర్​లోని సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్​ సోయిబా మనిగబ్బా రంగ్మామీని సత్కరించాను. ఈ యువ సైనికుడిని కలవడం గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి సైనికులకు దేశం రుణపడి ఉంటుంది. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలని మణిపుర్​ యువతను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది."

-ఎన్​.బీరెన్ సింగ్, మణిపుర్ ముఖ్యమంత్రి.

తొలుత కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు... సరిహద్దుల్లో ధైర్య సాహసాలు కనబర్చిన యువ సైనికుడు ఈయనే అంటూ సోయిబా ఫొటోను షేర్​ చేసి ప్రశంసలతో ముంచెత్తారు.

Manipur CM felicitates captain Rangnamei
చైనా సైన్యాన్ని ఎదుర్కొన్న యువసైనికుడు సోయిబా

పదో విడత కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశాలకు ముందు సానుభూతి పొందేందుకు చైనా ఓ ప్రచార వీడియోను విడుదల చేసింది. ఇందులో గల్వాన్‌ ఘటనలోని కొన్ని క్లిప్‌లను కూడా ఉంచింది. వీటిల్లో భారత దళాలు తమ భూభాగంలోకి వస్తున్నాయని పేర్కొంది. వాస్తవానికి భారత దళాలు చైనా ఆక్రమణలను ఖాళీ చేయించే ప్రయత్నం అది. ఈ వీడియోలో చైనా సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నట్లు కనిపించిన యువసైనికుడే మణిపుర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన సోయిబా మనినగ్బా రంగ్నామీ.

ఇదీ చదవండి:'500 మీటర్ల దూరంలో భారత్, చైనా సైన్యాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.