ETV Bharat / bharat

ఫోన్​ కొట్టేశాడని.. పడవలో తలకిందులుగా వేలాడదీసి..

Fisherman beaten in Karnataka: ఫోన్​ దొంగలించాడనే ఆరోపణలతో.. ఓ వ్యక్తిని కొందరు తలకిందులుగా వేలాడదీశారు. ఫోన్​ గురించి పదేపదే అరుస్తూ ప్రశ్నలు వేశారు. ఈ ఘటన.. కర్ణాటక మంగళూరులో జరిగింది.

fisherman upside down hanging
ఫోన్​ కొట్టేశాడని.. పడవలో తలకిందులుగా వేలాడదీసి..
author img

By

Published : Dec 23, 2021, 2:07 PM IST

Updated : Dec 23, 2021, 2:20 PM IST

ఫోన్​ కొట్టేశాడని.. పడవలో తలకిందులుగా వేలాడదీసి..

Fisherman upside down hanging: కర్ణాటక మంగళూరులో ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్​ దొంగలించాడనే ఆరోపణలతో.. ఓ మత్స్యకారుడిని తలకిందులుగా వేలాడతీశారు.

fisherman beaten in karnataka
తలకిందులుగా వేలాడదీస...

ఇదీ జరిగింది..

ఆంధ్రప్రదేశ్​కు చెందిన వైల శ్రీను.. మంగళూరులో మత్స్యకారుడిగా పని చేసుకుంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో జాలరి ఫోన్​ ఇటీవలే పోయింది. శ్రీను ఆ ఫోన్​ దొంగలించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో మిగిలిన వారు శ్రీనుపై అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. పడవలో తాళ్లకు అతడిని కట్టేసి తలకిందులుగా వేలాడదీశారు. ఫోన్​ ఎక్కడ ఉందని పదేపదే అరుస్తూ ప్రశ్నించారు.

శ్రీనును ఈ విధంగా హింసించిన వారు కూడా ఆంధ్రప్రదేశ్​కు చెందిన వారేనని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పండేశ్వర పోలీస్​ స్టేషన్​లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. పోలీసులు ఆరుగురిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి:- గాలిలో ఎగిరిన వ్యక్తి.. ఎలా సాధ్యమైంది?

Last Updated : Dec 23, 2021, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.