ETV Bharat / bharat

మాస్క్​ పెట్టుకోమన్నందుకు వాగ్వాదం- వైద్యునిపై కేసు

author img

By

Published : May 20, 2021, 6:45 AM IST

అతనో వైద్యుడు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో మాస్క్ ​పెట్టుకోవాలని చెప్పేది పోయి.. మాస్క్​ ధరించడానికి నిరాకరించాడు. మాస్క్​ పెట్టుకోవాలని సూచించిన వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ వైద్యుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.

Doctor
వైద్యుడు
మాస్క్​ పెట్టుకోనన్న వైద్యుని అరెస్టు

ఓ వైద్యుడిగా మాస్క్​ గురించి ఇతరులకు అవగాహన కల్పిస్తూ.. ధరించేలా చేసే వైద్యుడే నిర్లక్ష్యంగా వ్యవహించాడు. మాస్క్​ లేకుండానే సూపర్​ మార్కెట్​కు వెళ్లాడు. అక్కడి సిబ్బంది, ఇతరులు మాస్క్​ పెట్టుకోవాలని సూచిస్తే.. వారితోనే వాగ్వాదానికి దిగాడు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Doctor
మాస్క్​ పెట్టుకోమన్న సిబ్బందితో వైద్యుడి వాగ్వాదం

కక్కిలయ అనే డాక్టర్​.. మే18న ఉదయం 8తర్వాత సూపర్​ మార్కెట్​కు వెళ్లాడు. అయితే అక్కడి సిబ్బంది ఆయన్ని మాస్క్​ ధరించమని అడిగారు. అందుకు ఆయన తిరస్కరించారు. పైగా వారితో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా ప్రభుత్వం మాస్క్​ పెట్టుకోవాలనే మూర్ఖపు సూచన చేస్తోందని ఆరోపించారు. ఇదంతా గమనించిన మార్కెట్​కు సంబంధించిన భాగస్వామి ర్యాన్​ రోసారియో.. పోలీసులకు సమాచారమిచ్చారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

Doctor
సిబ్బందితో గొడవ పెట్టుకున్న వైద్యుడు

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. దాంతో ఆ వైద్యునిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనికి కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'సీఎం వ్యాఖ్యలను దేశానికి ఆపాదించకూడదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.