ETV Bharat / bharat

200 కిలోల రైస్​- చికెన్​తో శునకాల ఆకలి తీర్చుతున్న జంతుప్రేమికురాలు - జంతు ప్రేమికురాలు రజని శెట్టి

Mangalore animal lover: మంగళూరులో ఓ జంతుప్రేమికురాలు రోజూ 800 శునకాల ఆకలి తీర్చుతున్నారు. 200 కేజీల రైస్​- చికెన్​తో వాటికి ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు మరో 60 పక్షులు, పిల్లులను కూడా సంరక్షిస్తున్నారు. 15 ఏళ్లుగా మూగజీవాల సేవలో తరిస్తున్న ఈమె అందరి మన్ననలు పొందుతున్నారు. దాతలు కూడా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇంతకీ ఆమె జంతుప్రేమికురాలిగా ఎలా మారారంటే..

mangalore animal lover, రజని శెట్టి
mangalore animal lover
author img

By

Published : Dec 18, 2021, 8:07 AM IST

200 కిలోల రైస్​- చికెన్​తో శునకాల ఆకలి తీర్చుతున్న జంతుప్రేమికురాలు

Mangalore animal lover: మూగజీవాల పట్ల అపార ప్రేమను చూపుతూ అందరి మన్ననలు పొందుతున్నారు కర్ణాటక మంగళూరుకు చెందిన జంతుప్రేమికురాలు రజనీ శెట్టి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 వీధి శునకాలు ఆకలి తీర్చుతూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. రోజు 200 కేజీల రైస్​- చికెన్​తో శునకాల కడుపు నింపుతున్నారు. వాటిని సొంత బిడ్డల్లా ఏ లోటు రాకుండా సేవలందిస్తున్నారు.

రజనీ శెట్టి 15 ఏళ్ల క్రితమే ఈ సేవను ప్రారంభించారు. ఒక రోజు ఓ వ్యక్తి ఆమ్లెట్ తిన్న పేపర్​ను పడేయగా.. ఆకలితో ఉన్న ఓ శునకం దాన్ని తింది. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన రజనీ వెంటనే అదే షాపులో ఆమ్లెట్​ కొనుక్కొచ్చి మూగజీవి ఆకలి తీర్చింది. అనంతరం ఆ శునకం మొహంలో చూసిన ఆనందం రజనీని తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటి నుంచి తనకు తారసపడ్డ వీధి శునకాల ఆకలి తీర్చుతూ వస్తోంది. క్రమక్రమంగా వాటి సంఖ్య పెరిగి ఇప్పుడు 800కు చేరింది. జంతువుల పట్ల ఈమె ప్రేమను చూసిన చాలా మంది దాతలు సాయం చేసేందుకు ముందుకువచ్చారు.

mangalore animal lover, రజని శెట్టి
శునకంతో ఆప్యాయంగా రజని

Animal lover rajani shetty

రజనీ మంగళూరులో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. మూగజీవాల పరిరక్షణలో భర్త, ముగ్గురు పిల్లలు కూడా ఆమెకు వెన్నంటే ఉంటున్నారు.

mangalore animal lover, రజని శెట్టి
శునకంతో మాట్లాడుతున్న రజనీ

800 శునకాలతో పాటు పక్షులు, పిల్లులు సహా మరో 60 జీవాలు కూడా రజనీ సంరక్షణలో ఉంటున్నాయి. అవి బలహీనంగా ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆకలితో అలమటిస్తున్నా రజనీ వెంటనే ఇంటికి తీసుకెళ్లి సేవలు చేస్తారు. వాటి బాగోగులు దగ్గరుండి చూసుకుంటారు.

rajani shetty animal rescue

రజనీ జంతువుల ప్రాణాలు కాపాడటం కోసం పెద్ద పెద్ద సాహసాలు కూడా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 45 అడుగుల లోతు బావిలో పడిన ఓ శునకాన్ని రక్షించేందుకు ఆమె తాళ్ల సాయంతో లోపలికి దిగారు. దాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రజనీ ధైర్యసాహసాలు, జంతువుల పట్ల చూపిస్తున్న ప్రేమ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. శునకంతో రజని ఆప్యాయంగా మాట్లాడుతున్న మరో వీడియో కూడా ప్రజల నుంచి విశేష మన్ననలు పొందింది.

mangalore animal lover, రజని శెట్టి
బావిలో పడిన శునకాన్ని రక్షించిన దృశ్యం

తాను 15ఏళ్లుగా ఈ సేవ చేస్తున్నానని ఈటీవీ భారత్​తో రజనీ చెప్పారు. జంతువులను కాపాడటం 20 ఏళ్ల క్రితమే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 800 శునకాలకు ఆహారం అందించేందుకు రోజూ 5 కిలోమీటర్లు ప్రయాణిస్తానని తెలిపారు రజనీ.

Mangaluru woman

రజనీ సేవను చూసి మంగళూరులోని యానిమల్ కేర్​ ట్రస్టు కూడా సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అనారోగ్యానికి గురైన జంతువులకు చికిత్స అందించడానికి తోడ్పడుతోంది.

రజనీ జంతువుల పట్ల చూపిస్తున్న ప్రేమను చూసి టీమ్​ఇండియా వెటరన్ క్రికెటర్​ వీవీఎస్​ లక్షణ్​ కూడా ముగ్ధుడయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె సేవకు హ్యాట్సాఫ్​ అన్నారు.

ఇదీ చూడండి: భార్య నిత్యలక్ష్మి.. భర్త 'నిత్య' పెళ్లి కొడుకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.