ETV Bharat / bharat

మణప్పురంలో భారీ దోపిడీ, నిమిషాల్లోనే 24కిలోల గోల్డ్, 10లక్షల క్యాష్ చోరీ - 24కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు

Manappuram bank robbery దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. మణప్పురం గోల్డ్​ బ్యాంక్​లోకి ఆయుధాలతో చొరబడి 24 కిలోల బంగారం, రూ.10లక్షల నగదు ఎత్తుకెళ్లారు. రాజస్థాన్​ ఉదయ్​పుర్​లో సోమవారం జరిగిందీ ఘటన.

Etv Bmanappuram bank robbery harat
Etv Bhaమణప్పురంలో భారీ దోపిడీrat
author img

By

Published : Aug 29, 2022, 1:23 PM IST

Updated : Aug 29, 2022, 1:56 PM IST

మణప్పురంలో భారీ దోపిడీ

Manappuram bank robbery: రాజస్థాన్​ ఉదయ్​పుర్​లో ఐదుగురు దుండగులు కలిసి 24 కిలోల బంగారం, రూ.10లక్షల నగదు దోచుకెళ్లారు. సోమవారం ఉదయం ప్రతాప్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మణప్పురం గోల్డ్ బ్యాంక్​లోకి ఆయుధాలతో చొరబడి, నిమిషాల వ్యవధిలోనే ఈ దోపిడీ చేశారు. అక్కడి సిబ్బందిని పిస్టళ్లతో బెదిరిస్తూ.. మెరుపు వేగంతో పరారయ్యారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలికి వెళ్లారు. నిందితుల కోసం వేట ప్రారంభించారు. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసుల్ని మోహరించి, విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. సోమవారం ఉదయం బ్యాంక్​ తెరిచిన వెంటనే ఐదుగురు దుండగుల్లో ఇద్దరు లోపలకు ప్రవేశించారు. మిగతా వారు బ్యాంక్ బయట కాపలాగా ఉన్నారు. దుండగులు అందరూ ఫేస్ మాస్క్​లు ధరించారు. బ్యాంక్ సిబ్బందిని పిస్టళ్లతో బెదిరించి.. వారందరినీ నేలపై కూర్చోబెట్టారు. బ్యాంక్ సిబ్బందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎదురుతిరిగిన సిబ్బందిలోని ఓ వ్యక్తిని కాలితో తన్నారు. మరికొందరి ముఖంపై దాడి చేశారు. అంతలో మరో వ్యక్తి దుండగులకు బ్యాగ్​ను అందించాడు. బ్యాంక్ ఉద్యోగులంతా బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉండగానే దోపిడీ పూర్తిచేసి పారిపోయారు దుండగులు.

ఇవీ చదవండి: వరదలో బస్సు, లక్కీగా బయటపడ్డ ప్రయాణికులు, ఎంపీ ఇల్లు జలమయం

హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం, రఫేల్​ స్కామ్​పై విచారణకు నో

Last Updated : Aug 29, 2022, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.