ETV Bharat / bharat

ఎర్రకోట వద్ద కత్తి తిప్పిన వ్యక్తి అరెస్ట్ - రైతు సంఘాల నిరసన

జనవరి 26న దిల్లీలో హింసకు సంబంధించి పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ఎర్రకోట వద్ద అతడు కత్తి తిప్పుతూ నిరసనకారులను ప్రేరేపించాడని పేర్కొన్నారు.

R-Day violence, redfort
ఎర్రకోట వద్ద కత్తితిప్పిన వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Feb 17, 2021, 12:18 PM IST

గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో హింసకు సంబంధించిన కేసులో పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఎర్రకోటపై కత్తితో విన్యాసాలు చేసిన నిందితుడు మణిందర్​ సింగ్​ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

"ఘటన జరిగిన రోజు ఎర్రకోట వద్ద నిందితుడు కత్తులు తిప్పుతూ విన్యాసం చేసిన దృశ్యాలు సంబంధిత వీడియోలో ఉన్నట్లు గుర్తించాం. నిరసనకారులను రెచ్చగొట్టే విధంగా అతను ప్రవర్తించాడు. ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొనేలా మరో ఆరుగురిని ప్రోత్సహించాడు. ఆ రోజు 4.3 అడుగుల పొడవు ఉండే రెండు కత్తులను వెంట తీసుకు వచ్చాడు."

-దిల్లీ పోలీసులు

దేశ రాజధానిలోని స్వరూప్​ నగర్​కు చెందిన మణిందర్ కత్తిసాము శిక్షణ ఇస్తుంటాడని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి : బస్సు ప్రమాదంలో 50కి చేరిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.