Delhi Police Chief Photo Man Used: గుర్తు తెలియని వ్యక్తి.. దిల్లీ కమిషనర్ రాకేశ్ అస్థానా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ న్యాయవాది బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నట్లు దిల్లీ న్యాయవాది మంజీత్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యాయవాది మంజీత్ సింగ్.. వాట్సాప్ చాట్ డేటాతో పాటు కాల్ లిస్ట్‌ను కూడా పోలీసులకు అందించారు. అయితే దుండుగుడు.. వాట్సాప్ ఎకౌంట్‌కు దిల్లీ పోలీసు చీఫ్ ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య... కిడ్నాప్ చేసి 4ఏళ్ల బాలికపై రేప్
చీరకట్టులోనే వరద ప్రాంతాల్లో పర్యటన.. ఐఏఎస్ అధికారిణిపై ప్రశంసల వెల్లువ