ETV Bharat / bharat

యూట్యూబ్​లో చూసి భార్యకు ప్రసవం​.. చివరికి ఇలా! - యూట్యూబ్​లో భార్యకు ఆపరేషన్ వార్తలు

Man Tries Delivery To Wife: యూట్యూబ్​లో చూసి గర్భవతిగా ఉన్న భార్యకు ఆపరేషన్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటనలో శిశువు మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Man Tries Delivery To Wif
యూట్యూబ్​లో చూసి భార్యకు ఆపరేషన్
author img

By

Published : Dec 21, 2021, 8:28 PM IST

Man Tries Delivery To Wife: యూట్యూబ్​లో చూసి వంటలు చేయడం, ఇతరత్రా పనులు నేర్చుకోవడం చూసుంటాం. కానీ తమిళనాడుకు చెందిన ఓ ప్రబుద్ధుడు మాత్రం కట్టుకున్న భార్యపైనే ప్రయోగం చేశాడు. యూట్యూబ్​లో చూసి గర్భవతిగా ఉన్న తన భార్యకు ఆపరేషన్ చేశాడు.

ఏమైందంటే..?

తమిళనాడు రాణిపేట్ జిల్లా పనప్పక్కం మండలం నెదుంపులి గ్రామానికి చెందిన లోకనాథన్​(32), గోమతి(28) దంపతులు. వారికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది.

అయితే లోకనాథన్​.. యూట్యూబ్​లో చూసి గర్భంతో ఉన్న తన భార్యకు డెలివరీ చేశాడు. ఈ ఘటనలో శిశువు మృతిచెందింది. గోమతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రస్తుతం వెల్లూర్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై వైద్యుల ఫిర్యాదు మేరకు నెమిలి స్టేషన్​ పోలీసులు లోకనాథన్​ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వేగంగా వచ్చి మహిళలను ఈడ్చుకెళ్లిన కారు- ఇద్దరు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.