Thane Man Steals For Wife Expenses: 'రాజ రాజ చోర' మూవీ చూశారా? భార్య డబ్బులు కావాలని అడిగిన ప్రతిసారీ హీరో ఏదో ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. సరిగ్గా.. అలాంటి ఘటనే మహారాష్ట్ర ఠాణే జిల్లాలో జరిగింది. భార్యతో ఔటింగ్‌కు వెళ్లడానికి వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు భర్త.
జిల్లాలోని మండప ప్రాంత పరిసరాల్లో బైక్ దొంగతనాలకు సంబంధించి కేసులు అధికంగా వచ్చాయి. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. ముమ్మరంగా దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలో సీసీటీవీలను గమనించారు. స్థానిక డీలర్లు, గ్యారేజ్‌లను తనిఖీ చేశారు. దర్యాప్తులో దీపక్‌ను నిందితునిగా గుర్తించారు. మండప పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది తనేనని ఒప్పుకున్నాడు. మరో నిందితుడు సరగరె అనే వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే.. సరెగరె చెప్పిన సమాధానం పోలీసులను విస్మయానికి గురిచేసింది. తనకు ఇటీవలే వివాహం అయిందని చెప్పిన నిందితుడు.. భార్యను ఔటింగ్‌కు తీసుకెళ్లడానికి డబ్బు కావాలని.. అందుకోసమే తను ఈ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించాడు.
స్క్రాప్‌గా మార్చి..
దొంగిలించిన బైక్‌లను రాహుల్ భగవత్ అనే వ్యక్తి సహాయంతో అమ్మేవారమని నిందితులు ఒప్పుకున్నారు. వాహన పత్రాలను తర్వాత అప్పజెప్పుతామని నమ్మించి విక్రయిస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని బైక్‌లను డీలర్ చిన్‌మున్ చౌహాన్ అలియాస్ బబ్లూకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఆయన ఆ బైక్‌లను స్క్రాప్‌గా మార్చి ధర్మదేవ్ చౌహాన్, షంషీర్ షబ్బీర్ ఖాన్, భైరావ్ సింగ్ ఖర్వాడ్ అనే వ్యాపారులకు విక్రయిస్తాడని వివరించారు.
ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. వారంతా 17 బైక్‌లను దొంగిలించారని తెలిపారు. ప్రస్తుతం నిందితుల వద్ద ఉన్న రూ.8.24 లక్షల విలువైన వాహనాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేశారు.
ఇదీ చదవండి: ఫోన్ కొట్టేశాడని.. పడవలో తలకిందులుగా వేలాడదీసి..
14 ఏళ్ల బాలుడిని హత్య చేసిన ఫ్రెండ్స్.. కాళ్లు, చేతులు నరికి...