ETV Bharat / bharat

యువకుడిపై దుండగుల హత్యాయత్నం.. 'నుపుర్​ శర్మ వీడియో చూడడమే కారణం'! - యువకుడిపై హత్యయత్నం

Nupur sharma controversy: బిహార్​లోని ఓ యువకుడిపై మరో వర్గానికి చెందిన పలువురు కత్తితో దాడి చేశారు. నుపుర్​ శర్మ వివాదాస్పద వీడియో చూడటం వల్లే యువకుడిపై హత్యాయత్నం జరిగినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు.

nupur sharma
నుపుర్​ శర్మ
author img

By

Published : Jul 19, 2022, 3:20 PM IST

Nupur sharma: భాజపా మాజీ నేత నుపుర్​ శర్మ వివాదానికి సంబంధించిన వీడియో చూసినందుకు ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు! 23 ఏళ్ల అంకిత్​ ఝా అనే వ్యక్తిపై మరో వర్గానికి చెందిన నలుగురు.. కత్తితో దాడి చేశారు. ఈ ఘటన బిహార్​లోని సితామర్హీ జిల్లా నాన్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం: అంకిత్​ ఓ పాన్​ షాప్​ దగ్గర వాట్సాప్​ చూస్తుండగా నిందితులు అతని వద్దకు వచ్చి గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారు అతనిపై దాడి చేసి పరారయ్యారు. స్థానికులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంకిత్​ చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఈ ఘటనకు మతపరమైన ఘర్షణలతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

మాతో బలవంతంగా..: ఈ హత్యాయత్నానికి, నుపుర్​ శర్మ వివాదానికి సంబంధం ఉందంటున్నారు బాధితుడి కుటుంబసభ్యులు. ఘటన జరిగిన సమయంలో బాధితుడు నుపుర్​ శర్మ వివాదానికి సంబంధించిన వీడియో చూస్తున్నాడని.. అందుకే ఓ వర్గానికి చెందిన నిందితులు అతని దాడి చేశారన్నారు. కానీ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసే సమయంలో ఆ పేరును ఫిర్యాదులో ప్రస్తావనకు తీసుకురాకూడదని.. అలానే ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తామని పోలీసులు బలవంతం చేసినట్లు ఆరోపించారు. కానీ అంకిత్​ కుటుంబసభ్యుల ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఈ ఘటనకు, మతఘర్షణలకు ఎలాంటి సంబంధం లేదని.. పరారీ ఉన్న నలుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు సితామర్హీ ఎస్​పీ తెలిపారు.

ఇదీ చూడండి : వినూత్నంగా నాగపంచమి వేడుకలు.. వందల పాములను మెడకు చుట్టుకొని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.