ETV Bharat / bharat

అన్నపై తమ్ముడి దాడి.. మెడకు గుచ్చుకున్న కత్తితోనే బైక్ తోలుతూ ఆస్పత్రికి.. చివరకు.. - మహారాష్ట్ర క్రైమ్ న్యూస్

Man Stabbed By Brother : ఓ వ్యాపారవేత్తపై తన తమ్ముడు, మరో వ్యక్తి కలిసి కత్తితో దాడి చేశారు. దీంతో వ్యాపారవేత్త మెడ భాగంలో కత్తి ఉండిపోయి.. తీవ్ర రక్తస్రావమైంది. ఆయన ఏమాత్రం బెదరకుండా మెడపై కత్తితోనే ఒక కిలోమీటరు బైక్​పై ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

brother stabbed brother
brother stabbed brother
author img

By

Published : Jun 6, 2023, 3:35 PM IST

Updated : Jun 6, 2023, 4:05 PM IST

Man Stabbed By Brother : దేశంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ముంబయిలో ఓ వ్యక్తి తన అన్నపై మరో వ్యక్తితో కలిసి కత్తితో దాడి చేశాడు. వెంటనే తమ్ముడి దాడి నుంచి తప్పించుకున్న సోదరుడు.. కత్తి మెడపై ఉండగానే బైక్​పై ఒక కి.మీ పాటు ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నాడు. బాధితుడిని తేజస్ పాటిల్ అనే వ్యాపారవేత్త(32)గా పోలీసులు గుర్తించారు.

ఇదీ జరిగింది..
తేజస్ పాటిల్​.. సంపాడలోని సెక్టార్​ 5లో నివసిస్తున్నారు. తేజస్​ తన ఇంట్లో నిద్రిస్తుండగా జూన్​ 3వ తేదీ రాత్రి.. ఆయన సోదరుడు మోనీశ్(30), మరో వ్యక్తితో కలిసి తన అన్నపై కత్తితో దాడి చేశాడు. దీంతో తేజస్​ మెడపై కత్తి ఉండిపోయి.. తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే నిందితులు ఇద్దరూ ఘటనాస్థలి నుంచి పరారరయ్యారు. నొప్పి, రక్తస్రావం తీవ్రంగా ఉన్నప్పటికీ.. తేజస్​ ఒక కిలోమీటరు బైక్​పై ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు వెంటనే తేజస్​కు శస్త్రచికిత్స చేసి ఆయన మెడపై ఉన్న కత్తిని తొలగించారు. మెడపై దాడి జరిగినా.. ధమనులు, సిరలు దెబ్బతినకపోవడం వల్ల తేజస్​ ప్రాణాలతో బయటపడ్డారని వైద్యులు తెలిపారు. తేజస్​పై దాడికి పాల్పడిన అతడి తమ్ముడు మోనీశ్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులిద్దరి కోసం గాలిస్తున్నారు.

కత్తితో పొడిచి హత్య..
23 ఏళ్ల యువకుడిని కత్తితో దారుణం పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన దిల్లీలోని నెబ్​సరాయ్​ ప్రాంతంలో సోమవారం జరిగింది. నిందితులిద్దరిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మృతుడిని సచిన్‌గా గుర్తించారు. నిందితులు.. మృతుడికి తెలిసినవారేనని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నెబ్​సరాయ్ ప్రాంతానికి చెందిన సచిన్(23) అనే వ్యక్తికి దేవరాజ్​(18), ఆయుష్(18) అనే ఇద్దరు యువకులతో పరిచయం ఉంది. అయితే సచిన్​తో అతని ఇంటి వద్ద సోమవారం దేవరాజ్​, ఆయుష్ గొడవపడ్డారు. వెంటనే ఇద్దరు నిందితులు కలిసి కత్తితో సచిన్​ను పొడిచారు. వెంటనే సచిన్ కుటుంబ సభ్యులు అతడిని ఎయిమ్స్​కు తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే సచిన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

"నిందితులకు, మృతుడికి వ్యక్తిగత శత్రుత్వం ఉంది. అందుకే సోమవారం వాగ్వాదానికి దిగారు. మృతుడు కూడా నిందితులను బెదిరించాడు. దీంతో నిందితులు అతడిపై కత్తితో దాడి చేసి హతమార్చారు. నిందితులు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం. దేవరాజ్‌, ఆయుష్‌.. సచిన్‌ను కత్తితో పొడిచారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి.. అరెస్ట్ చేశాం."

--పోలీసులు

Last Updated : Jun 6, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.