Man Shot Dead In Union Minister Home : కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ ఇంట్లో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. కేంద్ర మంత్రి తనయుడి తుపాకితో యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఫరీదీపుర్లోని మాధవపుర్ వార్డుకు చెందిన వినయ్ శ్రీవాస్తవ అనే యువకుడు, మంత్రి కౌశల్ కిశోర్ కుమారుడు వికాస్ స్నేహితులు. అయితే వీరిద్దరు గురువారం సాయంత్రం తమ స్నేహితులు అజయ్, రావత్, అంకిత్ వర్మ, షమీమ్, బాబాతో పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో తలెత్తిన గొడవలో కాల్పులు జరిగాయి. దీంతో శ్రీవాస్తవ మృతిచెందాడు. ఈ హత్యకు గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. నలుగురు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిలో వికాస్ పేరుతో ఉన్న లైసెన్స్డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. హత్య ఎవరు చేశారు? హత్యకు దారితీసిన కారణాలేవి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
VIDEO | "A boy named Vinay Srivastava was shot dead due to bullet injury. A total of six persons came to the house last night, had dinner and after the incident took place. We have recovered a pistol which is said to be of Vikas Kishore. We are investigating the matter. The… pic.twitter.com/eVRVt7CD4F
— Press Trust of India (@PTI_News) September 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "A boy named Vinay Srivastava was shot dead due to bullet injury. A total of six persons came to the house last night, had dinner and after the incident took place. We have recovered a pistol which is said to be of Vikas Kishore. We are investigating the matter. The… pic.twitter.com/eVRVt7CD4F
— Press Trust of India (@PTI_News) September 1, 2023VIDEO | "A boy named Vinay Srivastava was shot dead due to bullet injury. A total of six persons came to the house last night, had dinner and after the incident took place. We have recovered a pistol which is said to be of Vikas Kishore. We are investigating the matter. The… pic.twitter.com/eVRVt7CD4F
— Press Trust of India (@PTI_News) September 1, 2023
నా కుమారుడు దిల్లీలో ఉన్నాడు : మంత్రి
ఈ హత్య గురించి తెలుసుకున్న మంత్రి కౌశల్ కిశోర్.. కమిషనర్‌కు సమాచారం అందించారు. పోలీసు విచారణలో ఈ హత్య గురించి నిజానిజాలు వెల్లడవుతాయని మంత్రి అన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో తాను లేనని చెప్పారు. అయితే, తన కుమారుడు కూడా ఘటనాస్థలిలో లేడని.. అనారోగ్యంగా ఉన్న కారణంగా దిల్లీలో ఉన్నాడని తెలిపారు.
-
#WATCH | Lucknow, UP | BJP MP Kaushal Kishore says "This is a matter of investigation. Forensic teams and police have started the investigation. The person involved will not be spared. We are standing in support of the family members of the deceased. I have no idea who was at the… pic.twitter.com/rn73H8DiPt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Lucknow, UP | BJP MP Kaushal Kishore says "This is a matter of investigation. Forensic teams and police have started the investigation. The person involved will not be spared. We are standing in support of the family members of the deceased. I have no idea who was at the… pic.twitter.com/rn73H8DiPt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 1, 2023#WATCH | Lucknow, UP | BJP MP Kaushal Kishore says "This is a matter of investigation. Forensic teams and police have started the investigation. The person involved will not be spared. We are standing in support of the family members of the deceased. I have no idea who was at the… pic.twitter.com/rn73H8DiPt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 1, 2023
అప్పట్లో రైతులపై దాడి.. ఇప్పుడు హత్య : కాంగ్రెస్
ఈ ఘటనపై కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'ప్రధాని మోదీకి ఒక మంత్రి ఉన్నారు- కౌశల్ కిశోర్. ఆయన ఇల్లు లఖ్‌నవూలో ఉంది. ఈరోజు మంత్రి ఇంట్లో రక్తం మడుగులో యువకుడి మృతదేహాం లభ్యమైంది. అతడిని ఎవరో కాల్చి చంపారు. ఘటనాస్థలిలో లభ్యమైన పిస్టల్ మంత్రి కుమారుడిది. గతంలో మరో మంత్రి కుమారుడు రైతులపై దాడి చేయడం చూశారు. ఇప్పుడు మరో మంత్రి ఇంట్లో హత్య జరిగింది. ప్రధాని మోదీ కావాలనే అలాంటి వాళ్లను ఎంపిక చేసుకున్నారు' అని ఎక్స్‌లో మండిపడింది.