కర్ణాటకలో 12 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఓ దొంగను 10 గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు. బెంగళూరులోని సన్ స్కోర్ రిఫైనరీ సంస్థలో స్వప్నిల్ అనే యువకుడు ఈ చోరీకి పాల్పడ్డాడు. 3 నెలల క్రితం అతడు అందులో పనికి చేరాడు. మొదట్లో నమ్మకంగా పనిచేసిన స్వప్నిల్.. దుకాణం నుంచి బంగారాన్ని దొంగిలించేందుకు ప్రణాళికలు రచించాడు.
కరిగించిన బంగారాన్ని సమీప బంధువు ఇంట్లో పెట్టేందుకు యజమాని వెళ్లగా.. ఆయనతో కలిసి స్వప్నిల్ వెళ్లాడు. తర్వాత యజమాని ఇవ్వమన్నాడంటూ సదరు ఇంటికి వచ్చిన స్వప్నిల్ బంగారం తీసుకొని పారిపోయాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విల్సన్ గార్డెన్ పోలీసులు.. 10 గంటల్లోనే దొంగను పట్టుకున్నారు. మొత్తం రూ.4.58 కోట్లు విలువ గల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: టూల్‌కిట్ కేసులో శంతనుకు ముందస్తు బెయిల్